F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

గతంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి....

F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?

F3 Movie First Day Collections

F3: గతంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా నిన్న(మే 27న) ‘ఎఫ్3’ మూవీని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కూడా ఎఫ్2లోని నటీనటులు కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరిచారు. అంతేగాక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఉత్సాహం చూపారు.

F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!

దీంతో ఈ సినిమాకు తొలిరోజే మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలోనూ వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కామెడీ ట్రాక్ ఈ సినిమాను ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా మలిచింది. ఈ సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేగాక ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచకపోవడం మరో మేజర్ ప్లస్ పాయింట్‌గా మారింది.

F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి

అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.13.35 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఒక మీడియం రేంజ్ సినిమాకు ఇది చాలా మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా మౌత్ టాక్‌తోనే ఆడియెన్స్‌కు బాగా రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్3 మూవీ తొలిరోజు వసూలు చేసిన కలెక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.06 కోట్లు
సీడెడ్ – 1.26 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.18 కోట్లు
ఈస్ట్ – 0.76 కోట్లు
వెస్ట్ – 0.94 కోట్లు
గుంటూరు – 0.88 కోట్లు
కృష్ణా – 0.66 కోట్లు
నెల్లూరు – 0.61 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.10.35 కోట్ల షేర్ ( రూ.17 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 0.85 కోట్లు
ఓవర్సీస్ – 2.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.13.35 కోట్లు షేర్ (రూ.23 కోట్ల గ్రాస్)