F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!

టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ మూవీ ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఎఫ్2’ బాక్సాఫీస్....

F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!

F3 Movie Locks Its Runtime

F3: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ మూవీ ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఎఫ్2’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో, ఈ సీక్వెల్ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఎఫ్2 సినిమాలో నటిస్తున్న నటీనటులు మరోసారి తమ కామెడీ టైమింగ్, పంచులతో ఎఫ్3 సినిమాను కూడా అదే స్థాయిలో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ చేయడంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

F3 Movie: ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా’.. ఎఫ్3 నుండి పూజా హెగ్డే సాంగ్ రిలీజ్!

అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 28 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఇందులో 90 నిమిషాల పాటు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వే సీన్స్ బోలెడన్ని ఉండబోతున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎఫ్3 చిత్రంపై ప్రేక్షకులు ఎలాంటి అనుమానాలు లేకుండా థియేటర్లకు రావొచ్చని.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారని.. అంతేగాక ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ ఖచ్చితంగా ఉంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్‌ల జోడీలు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. సోనాల్ చౌహాన్ పర్ఫార్మెన్స్.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా మారుతాయని ఎఫ్3 టీమ్ అంటోంది.

Dil Raju : ‘F3’ సినిమాకి టికెట్ రేట్లు పెంచం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

మరి రెండున్నర గంటలసేపు నవ్వించేందుకు రెడీ అంటోన్న ఎఫ్3 చిత్ర యూనిట్, సినిమా లవర్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఈ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్లు పెంచకుండానే రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ సమ్మర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారు ఎఫ్3 సినిమా చూస్తే ఖచ్చితంగా వారికి పైసా వసూల్ అవుతాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.