F3 Movie : F3 మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు థియేట్టర్లో సినిమా చూసి, మా సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు. కొంతమంది ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి.......

F3 Movie :  F3 మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..

F3

F3 Movie :  వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F3 సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో, ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తో మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. అందర్నీ నవ్విస్తూ ఈ సినిమా మరింత ముందుకి దూసుకెళ్తుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్ లో మరింత జోష్ ని నింపుతున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా రిలీజైన నెల రోజులకే ఓటీటీలో వస్తుంది. దీంతో ఈ సినిమా కూడా త్వరలోనే ఓటీటీలోకి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకోసం థియేటర్స్ కి ఇంకా ఆడియన్స్ ని రప్పించడానికి F3 సినిమాని ఓటీటీలో అప్పుడే రిలీజ్ చేయమంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Manushi Chillar : ఈ మిస్‌వరల్డ్ కి రామ్‌చరణ్‌తో కలిసి డేటింగ్ చేయాలని ఉందట..

 

ఈ వీడియోలో.. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ”ఇప్పటివరకు థియేట్టర్లో సినిమా చూసి, మా సినిమా హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు. కొంతమంది ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది, అప్పుడు చూద్దాం అనుకుంటున్నారు కదా. ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రాదు. పెద్ద సినిమాలన్నీ 4 వారాలకే వచ్చేస్తున్నాయి, ఇది కూడా వచ్చేస్తుంది అనుకున్నారు కదా. ఈ సినిమా 8 వారల వరకు ఓటీటీలో రాదు” అని తేల్చేశారు. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి వస్తే చూద్దాం అనుకున్న వారి ఆశలపై గండి పడింది. కానీ ఇది మంచి పరిణామమే అని థియేటర్స్ అనుకుంటున్నాయి. దీంతో F3 సినిమా చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే.