F3 Movie : మహా శివరాత్రికి నవ్వించడానికి వస్తున్న ‘ఎఫ్ 3’

తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అంతకు ముందు లాగే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు కాని సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో

F3 Movie : మహా శివరాత్రికి నవ్వించడానికి వస్తున్న ‘ఎఫ్ 3’

F3 (1)

F3 Movie :  ‘ఎఫ్ 2’ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అనిల్ రావి పూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ మల్టి స్టారర్ సినిమాగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీలతో వచ్చి మరీ ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకున్నారు. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ కూడా ఈజీగా సాధించింది. ఇందులో తమన్నా, మెహరీన్ లు హీరోయిన్స్ గా నటించారు. ‘ఎఫ్ 2’ భారీ విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించారు.

Bigg Boss 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనే.. తన కోపమే తనని ముంచిందా??

అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీసిన తర్వాత ఈ సినిమాపై ఫోకస్ పెట్టాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ‘ఎఫ్ 2’ సినిమా కాస్ట్ అండ్ క్రూ తోనే ‘ఎఫ్ 3’ కూడా రాబోతుంది. ‘ఎఫ్ 3’లో అదనంగా క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే ఇందులో సునీల్ కూడా నవ్వించబోతున్నాడని తెలిసింది. ఇద్దరు హీరోయిన్స్ తో పాటు సోనాల్ చౌహన్ ని కూడా తీసుకున్నారు. ఈ సారి సినిమాని మరింత కామెడీతో పద్దతిగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Sonal Chauhan : ‘ఎఫ్ 3’ సినిమాలో బాలకృష్ణ హీరోయిన్

తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అంతకు ముందు లాగే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు కాని సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటంతో, అంతే కాక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇంకో షెడ్యూల్ షూట్ మిగిలిపోవడంతో ఈ సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. ఇప్పటి వరకు జనవరి దాకా సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. దీంతో ‘ఎఫ్ 3’ సినిమా ఫిబ్రవరిలో రాబోతుంది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సోలో గా వచ్చి ‘ఎఫ్ 2’ లాగే భారీ విజయం సాధించి మరోసారి 100 కోట్ల కలెక్షన్స్ ని సాధించాలని చూస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.