F3 Movie : వెంకటేష్‌కు రేచీకటి.. వరుణ్‌తేజ్‌కి నత్తి.. ‘ఎఫ్3’ కథ ఇదే..

నిన్న మీడియాతో తన సినిమాల గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా 'ఎఫ్3' స్టోరీ కూడా చెప్పేశారు. 'ఎఫ్2' లో భార్యాభర్తల మధ్య ఫ్రస్ట్రేషన్‌ తో కామెడీని పుట్టిస్తే 'ఎఫ్3' సినిమాలో....

F3 Movie : వెంకటేష్‌కు రేచీకటి.. వరుణ్‌తేజ్‌కి నత్తి.. ‘ఎఫ్3’ కథ ఇదే..

F3 (1)

F3 Movie :  2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ‘ఎఫ్‌-2’. సంక్రాంతి హాలిడేస్ కి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకున్నారు. ఒక మాములు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అర్ధమవుతుంది. ఈ విజయం ఇచ్చిన ఊపులో ‘ఎఫ్3’ కూడా తీసేద్దామని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు. ‘ఎఫ్3’ 2021 సంక్రాంతికే రావాలి కానీ కరోనా రావడంతో ఈ సినిమా కూడా వాయిదా పడింది. దీంతో ఈ సినిమాని 2022 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు.

Kaikala Satyanarayana : తెలుగు వాళ్లకి ‘కేజీఎఫ్‌’ని పరిచయం చేసిన కైకాల

‘ఎఫ్‌-2’లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్‌ ని చూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇవాళ అనిల్ రావిపూడి బర్త్ డే సందర్భంగా నిన్న మీడియాతో తన సినిమాల గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా ‘ఎఫ్3’ స్టోరీ కూడా చెప్పేశారు. ‘ఎఫ్2’ లో భార్యాభర్తల మధ్య ఫ్రస్ట్రేషన్‌ తో కామెడీని పుట్టిస్తే ‘ఎఫ్3’ సినిమాలో ఫ్రస్ట్రేషన్‌ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పుట్టే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు.

వరల్డ్ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కూతురు_ Allu Arha won Noble World Records

మీరంతా ఊహించినదానికంటే ఓ మోతాదు ఎక్కువగానే హాస్యం ఉంటుంది. ఈ సినిమాలో వెంకటేష్‌ రేచీకటితో బాధపడుతుంటాడు. వరుణ్‌తేజ్‌కు కొంచెం నత్తి ఉంటుంది. వాళ్లకుండే ఆ సమస్యల నుంచి కూడా చక్కటి వినోదం తీసుకొచ్చాము. ‘ఎఫ్‌-2’లో డైలాగ్‌, విభిన్నమైన మేనరిజమ్స్‌ ద్వారా హాస్యాన్ని పండించాం. కానీ ‘ఎఫ్‌-3’లో సంభాషణల కంటే పాత్రధారులు చేసే పనులు, వారి అయోమయం నుంచి కామెడీ పుడుతుంది. ఇక రెండో భాగంలో సునీల్‌, మురళీశర్మ వంటి నటులు కూడా ఉండటంతో సినిమాకి చాలా ప్లస్ అవుతుందని అన్నారు.

Rakul Preet Singh : రకుల్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను.. జస్ట్ ప్రేమ మాత్రమే

ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. కథాపరంగా ఎక్కువ మంది ఆర్టిస్టులు అవసరమయ్యారు. క్లైమాక్స్ సన్నివేశాల్ని 35 మంది ఆర్టిస్టులతో తీశాను. ఇంతమందిని ఒకేసారి హ్యాండిల్ చేయడం చాలా ఛాలెజింగ్‌గా అనిపించింది అని అన్నారు అనిల్ రావిపూడి.