Adipurush : ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు.. స్పందించిన మూవీ టీం!

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు అంటూ ఒక నోటు నెట్టింట వైరల్ అవుతుంది. దాని పై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది.

Adipurush : ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు.. స్పందించిన మూవీ టీం!

fake news on Prabhas Adipurush movie gone viral in social media

Prabhas Adipurush : ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేశారు. ఇక అదే ఈవెంట్ లో మూవీ నుంచి మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ తో సినిమా పై నమ్మకాన్ని కలిగించిన మేకర్స్.. సెకండ్ ట్రైలర్ తో సినిమా అంచనాలు క్రియేట్ చేశారు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఓం రౌత్.. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఒక కోరిక కోరాడు.

Prabhas : తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ కామెంట్స్..

రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించండి అంటూ కోరాడు. దానికి ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఓకే చెప్పడం కూడా జరిగింది. అయితే దాని గురించి చెబుతూ ఒక నోటు నేడు బయటకి వచ్చింది. అందులో “ఆదిపురుష్ సినిమాకి దళితులకు ప్రవేశం లేదు” అని ఉంది. ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారి మూవీ టీం వరకు చేరుకుంది.

Adipurush : చిరంజీవి గారు ఏంటి రామాయణంలో నటిస్తున్నావా? అని ప్రశ్నించారు..

దీంతో చిత్ర యూనిట్ రియాక్ట్ అయ్యింది. అది అవాస్తమని తేల్చి చెప్పేసింది. కాబట్టి ఆ వార్తలని నమ్మకండి. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.