సుశాంత్ బయోపిక్ ఆపేస్తారా?..

  • Published By: sekhar ,Published On : September 1, 2020 / 02:12 PM IST
సుశాంత్ బయోపిక్ ఆపేస్తారా?..

Stop Sushant Singh Rajput Bipoic: బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యతో బాలీవుడ్‌లో రేగిన మంట‌లు ఇంకా చ‌ల్లార‌నే లేదు. నెపోటిజంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్‌ది హత్యా? ఆత్మ‌హ‌త్యా? అనే కోణంలో సీబీఐ విచార‌ణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిక్కుముడుల వీడ‌క ముందే సుశాంత్ జీవిత క‌థను ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ‘శశాంక్’ అనే బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు.



ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు రాజ్‌ బ‌బ్బ‌ర్ త‌న‌యుడు ఆర్యా బ‌బ్బ‌ర్ ఈ బ‌యోపిక్‌లో హీరోగా న‌టిస్తున్నాడు. సనోజ్ మిశ్రా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజ‌ర్ పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు. సదరు పోస్టర్‌ను ఉరితాడు మ‌ధ్య‌లో ఆర్యా బ‌బ్బ‌ర్ ఉన్న‌ట్లు డిజైన్ చేశారు.
https://10tv.in/sushant-singh-rajput-case-rhea-chakrabortys-father-indrajeet-chakraborty-summoned-again-by-the-enforcement-directorate/
ఈ పోస్ట‌ర్‌ చూసిన సుశాంత్ కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంట‌నే నిలిపి వేయాల‌ని వారంద‌రూ కోరుతున్నారు. ప్రస్తుతం సీబీఐ సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.