Naatu Naatu : నాటు నాటు ఆస్కార్ గెలుపుపై రాజకీయ ప్రముఖుల కామెంట్స్.. మోదీ, జగన్, చంద్రబాబు, కేసీఆర్.. అభినందనలు..

నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు..............

Naatu Naatu : నాటు నాటు ఆస్కార్ గెలుపుపై రాజకీయ ప్రముఖుల కామెంట్స్.. మోదీ, జగన్, చంద్రబాబు, కేసీఆర్.. అభినందనలు..

Famous movie and political personalities appriciate RRR Team for naatu naatu song winning Oscar

Naatu Naatu :  ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా RRR నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచి భారతదేశ ప్రజలకు కొత్త ఆశలను చిగురించింది. తాజాగా నేడు ఉదయం లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ 2023 వేడుకలు జరగగా ఇందులో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు, ఇండియన్ పాటగా నాటు నాటు చరిత్ర లిఖించింది. ఆస్కార్ వేదికపై చంద్రబోస్, కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు.

నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక పలువురు రాజకీయ నాయకులూ ప్రెస్ మీట్ పెట్టి మరీ RRR చిత్ర టీంని అభినందిస్తున్నారు.

ప్రధాని మోదీ సోషల్ మీడియా ట్వీట్ చేస్తూ అధికారికంగా RRR చిత్రయూనిట్ ని అభినందించారు. చంద్రబోస్, కీరవాణిలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా గర్వంగా ఫీల్ అవుతుందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆస్కార్ పోటీలో తెలుగువారు ప్రపంచానికి టార్చ్ బేరర్ లా నిలవటం గర్వకారణం. భారతదేశం ఓ చరిత్ర సృష్టించిన రోజు ఇది. 95ఏళ్ల ఆస్కార్ చరిత్రలో నాటు నాటు పాట చరిత్ర సృష్టించి తెలుగునేలని పులకింప చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, పాట రాసిన చంద్రబోస్, దర్శకుడు రాజమౌళికి నా అభినందనలు. టీం లీడర్ రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. అంతా ఓ చరిత్ర సృష్టించేలా కష్టపడ్డారు అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సంగీత ప్రియులను తట్టిలేపిన ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు, రాజమౌళి గారు, చంద్రబోస్ వ్రాసిన మరియు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ చేత అందించబడిన ఈ పాట, చరిత్ర సృష్టించడానికి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరాక్రమాన్ని రెపరెపలాడే విధంగా ప్రభావం, వేగం, బీట్ మరియు డెప్త్‌తో అనేక రకాల జానర్‌లను విస్తరించింది. గ్లోబల్ ప్రేక్షకుల చెవులను సంగీతంతో ఆస్కార్ తీగను కొట్టినందుకు మొత్తం యూనిట్‌కు శుభాకాంక్షలు అని అన్నారు.

 

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఝాపకం. విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణం. ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతోపాటు RRR సినిమా చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు నా శుభాకాంక్షలు అని అన్నారు.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన RRR చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగు వెండితెర ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విశ్వ వేదికపై భారతీయ సినిమాకి దక్కిన మరో గొప్ప గౌరవం అని అన్నారు.

 

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన RRR చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు. తెలుగు వెండి తెరకు పండుగ రోజుగా నా ఛాతి ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం అయింది. తెలుగు వెండితెర ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

Oscars95 : ఆస్కార్‌ 2023లో ఎక్కువ అవార్డులు అందుకున్న సినిమా ఏదో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయి. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ కు ప్రత్యేక అభినందనలు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి శుభాకాంక్షలు. నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయం. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఈ అవార్డు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజు. తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తుంది అని అన్నారు.