Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ.. | Famous Singer sangeetha Sajith Passes away

Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..

46 సంవత్సరాల నేపథ్య గాయని సంగీత సజిత్.. తమిళ, కన్నడ,తెలుగు భాషల సినిమాల్లో పలు పాటలు పాడారు. దాదాపు ఆమె 200 పాటలకు పైగా పాడారు. గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో......

Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..

 

Sangeetha Sajith :   గత సంవత్సర కాలం నుంచి కరోనా వల్ల, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది ప్రముఖ సింగర్స్ ని కోల్పోయాము. SP బాలు, లతా మంగేష్కర్ లతో పాటు చాలా మంది సింగర్స్ ని ఇటీవల కోల్పోయాము. భారత సంగీత సినీ పరిశ్రమకి గడిచిన రెండేళ్లలో ఎందరో సంగీత కళాకారులు దూరమయి విషాదాన్ని నింపారు. తాజాగా మరో ప్రముఖ గాయని మరణించారు. తమిళనాడుకు చెందిన నేపథ్య గాయని సంగీత సజిత్‌ ఇకలేరు.

Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..

46 సంవత్సరాల నేపథ్య గాయని సంగీత సజిత్.. తమిళ, కన్నడ,తెలుగు భాషల సినిమాల్లో పలు పాటలు పాడారు. దాదాపు ఆమె 200 పాటలకు పైగా పాడారు. గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ సంగీత ఆదివారం ఉదయం కన్నుమూశారు. తిరువానంతపురంలోని తన సోదరి నివాసంలో ఉంటూ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు సంగీత సజిత్. సంగీత సజిత్‌ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం తిరువానంతపురంలో జరగనున్నాయి. గాయని సంగీత సజిత్ మరణించిందని తెలిసి పలువురు సౌత్ సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

×