A.R.Rahman: నటుడిగా ఎప్పుడు కనిపిస్తారు.. రెహమాన్ సరదా సమాధానం!

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన సంగీతంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టి ఆస్కార్ అవార్డ్ గ్రహితగా నిలిచాడు. భారతీయ స

A.R.Rahman: నటుడిగా ఎప్పుడు కనిపిస్తారు.. రెహమాన్ సరదా సమాధానం!

A.r.rahman

A.R.Rahman: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన సంగీతంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టి ఆస్కార్ అవార్డ్ గ్రహితగా నిలిచాడు. భారతీయ సంగీతాన్ని యూనివర్సల్ చేసిన సంగీత ద్రష్ట. సాంప్రదాయ సంగీతం నుంచి పాశ్యాత్య సంగీతం వరకు అన్ని రకాల సంగీతాలను తన సంగీత దర్శకత్వంతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడం కూడా రెహమాన్‌కే మాత్రమే చెల్లింది. ఇంతలా భారతీయ సంగీతాన్ని దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ వ్యాప్తంగా అందరినీ అలరించిన సంగీత దర్శకుల్లో అగ్రగణ్యుడు రెహమాన్.

ఈ మధ్య కాలంలో సంగీత దర్శకులు, గాయకులు కూడా వెండితెర మీదకి టర్న్ ఇచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. గెస్ట్ పాత్రల నుండి ఫుల్ లెన్త్ రోల్స్ వరకు సంగీత దర్శకులు కూడా నటులుగా మారిపోతున్నారు. అలాంటిది యూనివర్సల్ ఐకాన్ గా పేరున్న రెహమాన్ సై అంటే దర్శక, నిర్మాతలు ఆయన కోసం పాత్రలను సిద్ధం చేసుకొని ఇంటి ముందు క్యూ కడతారు. అయితే, రెహమాన్ మాత్రం ఆన్ స్క్రీన్ కు దూరంగా ఉండేందుకే ఇష్టపడుతుంటారు. ఇకపై కూడా ఆయనకు ఆ ఉద్దేశ్యం లేదని మరోసారి స్పష్టం చేశారు.

అందరు సెలబ్రిటీల మాదిరే రెహమాన్ కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. అలానే ఈమధ్య అభిమానులతో లైవ్ లో ఉండగా ఓ నెటిజన్ మీరు ఎప్పుడు నటుడిగా మారబోతున్నారని అడిగాడు. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రెహ‌మాన్ సరదా స‌మాధానం ఇచ్చాడు. గతంలో మాదిరిగా నేను ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అని అన్నాడు. దీంతో రెహ‌మాన్ న‌టుడిగా క‌న‌ప‌డే ఛాన్స్ ఇప్పట్లో లేద‌ని మరోసారి ఆయన సమాధానం ద్వారా తేలిపోయింది.