RRR Postpone: ఫ్యాన్స్ డిసప్పాయింట్.. డిప్రెషన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్?

అదిగో బొమ్మ.. ఇదిగో రిలీజ్ అంటూ.. మూడేళ్ల పాటు ఊరించిన ఆర్ఆర్ఆర్.. తీరా ముహూర్తం నాటికి రిలీజ్ అవ్వకుండా సైడైపోయింది. పాన్ ఇండియా లెవల్లో పీక్స్ లో ప్రమోషన్లు చేసిన ఈ స్టార్..

RRR Postpone: ఫ్యాన్స్ డిసప్పాయింట్.. డిప్రెషన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్?

Rrr Postpone

RRR Postpone: అదిగో బొమ్మ.. ఇదిగో రిలీజ్ అంటూ.. మూడేళ్ల పాటు ఊరించిన ఆర్ఆర్ఆర్.. తీరా ముహూర్తం నాటికి రిలీజ్ అవ్వకుండా సైడైపోయింది. పాన్ ఇండియా లెవల్లో పీక్స్ లో ప్రమోషన్లు చేసిన ఈ స్టార్ స్టడెడ్ మూవీ ఆఖరి నిమిషంలో రాము.. రాలేము.. రాలేకపోతున్నామంటూ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఆడియన్స్ జస్ట్ డిసప్పాయింట్ అయ్యారు.. ఇక ట్రిపుల్ఆర్ టీం మాత్రం డిప్రెషన్ లోకి వెళ్ళింది.

Spider-Man: 10 వేల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న స్పైడర్ మ్యాన్!

రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ తోపు స్టార్స్ తో ట్రిపుల్ ఆర్ మూవీని గ్రాండ్ గా జనవరి 7న రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. లాస్ట్ మినిట్ లో కోవిడ్ వల్ల సినిమా రిలీజ్ చేసే పరిస్తితులు లేకపోవడం వల్ల ప్రస్తుతానికి సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ పోన్ న్యూస్ తో అటు ఫాన్స్ డిసప్పాయింట్ అయితే.. ట్రిపుల్ ఆర్ యూనిట్ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని న్యూస్. ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ నుంచి ఇంకా ఎవరూ కోలుకోలేదని, చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పోస్ట్ పోన్ తో బాగా డిప్రెస్ అయిపోయారని తెలుస్తోంది.

NBK 107: క్రాక్ కాంబినేషన్ రిపీట్.. బాలయ్య కోసం జయమ్మ ఫిక్స్!

ఎన్నో ఆశలతో మూడేళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది ట్రిపుల్ఆర్ మూవీ. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ క్రియేట్ చెయ్యడానికి చాలా కష్టపడ్డారు టీమ్. అంతేకాదు ప్రమోషన్లకు దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు మేకర్స్. నేషనల్ మీడియా దగ్గరనుంచి తమిళ్, కన్నడ, మళయాళం ఇలా వరస పెట్టి ఈవెంట్స్ చేసిన ట్రిపుల్ ఆర్.. ఈ ఈవెంట్స్ లో ఫాన్స్ కోసమే దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టింది. చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ ని షిఫ్ట్ చెయ్యడానికి, వాళ్లకి అకామడేషన్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి బాగా ఖర్చుపెట్టారు ట్రిపుల్ఆర్ ప్రొడ్యూసర్లు.

Atithi Devo Bhava: నానీ చేతుల మీదుగా ఆది ‘అతిధి దేవోభవ’ ట్రైలర్!

అసలు సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఓ బాధైతే.. లాస్ట్ మినిట్ లో ఈ రేంజ్ లో ప్రమోషన్లు చేసి.. ఇక సినిమా రిలీజే లేటనుకుంటున్న టైమ్ లో రిలీజ్ వాయిదా పడడంతో ఒక్కసారిగా డిప్రెస్ అయిపోయింది టీమ్. ఈ ప్రమోషన్ల ఊపులో ట్రిపుల్ఆర్ సినిమా రిలీజ్ అయితే.. ఆల్రెడీ ఉన్న రికార్డులన్నీ తిరగరాయడం గ్యారంటీ అని అటు టీమ్ తో పాటు ఫాన్స్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ లాస్ట్ కి సీన్ రివర్స్ అవ్వడంతో.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అందరూ.