Hari Hara Veera Mallu: వీరమల్లు టీజర్ కోసం ఆతృతగా చూస్తున్న ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ చిత్రంలో పవన్ ఎలాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Fans Eagerly Waiting For Hari Hara Veera Mallu Teaser
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పీరియాడికల్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ చిత్రంలో పవన్ ఎలాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hari Hara Veera Mallu: కన్ఫ్యూజన్‌లో పడేసిన వీరమల్లు.. వస్తాడా రాడా..?
అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతుండగా, ఇప్పటివరకు కేవలం ఓ వీడియో గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వీరమల్లు పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పవన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. దీంతో ఈ చిత్ర టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో మరింతగా పెరిగిపోయింది.
Hari Hara Veera Mallu: వీరమల్లు నెక్ట్స్ షెడ్యూల్ ఆ రోజునే స్టార్ట్..?
ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రానుంది. ఎంఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.