Chiranjeevi’s Family: మెగా ఫోటోలో అభిమానులు అతనిని మిస్ అయ్యారంట!

అభిమానుల గుండెల్లో కొలువుదీరిన వెండితెర మెగాస్టార్, టాలీవుడ్ హీరో చిరంజీవి

Chiranjeevi’s Family: మెగా ఫోటోలో అభిమానులు అతనిని మిస్ అయ్యారంట!

Mega Family

Chiranjeevi’s Family: అభిమానుల గుండెల్లో కొలువుదీరిన వెండితెర మెగాస్టార్, టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి 66వ బ‌ర్త్ డే వేడుక‌ల్లో కుటుంబం మొత్తం పాల్గొనగా.. అదేరోజు రాఖీ కూడా కావడంతో సందడి వాతావరణం వారి ఇంట్లో కనిపించింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ రోజు గెట్ గెదర్ అవ్వగా.. ఒకేరోజు రెండు పండుగలు జరుపుకున్నారు- ఒకటి రాఖీ, మరొకటి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.

చిరంజీవి ఇంట్లో జరిగే గ్రాండ్ ఈవెంట్‌కు దాదాపుగా మెగా ఫ్యామిలీ హాజరవుతుంది. మెగా సోదరులు, బంధువులందరూ ఒకే చోట కనిపించగా వేడుక గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నాగ బాబు, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత మరియు ఆమె భర్త, శ్రీజ- కళ్యాణ్ దేవ్, చిరంజీవి సోదరీమణులు, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక మరియు ఆమె భర్త అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా తన భార్యతో కలిసి వచ్చారు.

అయితే, ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కుటుంబం కానీ, అల్లు శిరీష్ కానీ, ఎక్కడా కనిపించలేదు. ఈ వేడుకలో బన్నీ అభిమానులు తమ స్టార్‌ని మిస్సయ్యారు. అల్లు అర్జున్ షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే అయితే, కనీసం అతని భార్య స్నేహా రెడ్డి కూడా రాలేకపోయింది. కనీసం ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్ అయినా రావాలి. అల్లు సోదరులు ఫోటోలో మిస్ అవ్వడంతో ఫ్యామిలీ ఫోటో కూడా అసంపూర్తిగా అనిపిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.