RRR కి ఇంట్రెస్టింగ్ టైటిల్స్!

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 09:57 AM IST
RRR కి ఇంట్రెస్టింగ్ టైటిల్స్!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న RRR మూవీపై దేశవ్యాప్తంగా అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వత మళ్లీ ఆ రేంజ్ సినిమానే టేకాఫ్ చేసిన జక్కన్న ఫుల్లుగా వర్కవుట్ చేస్తున్నాడు. ఇక RRR అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని స్టార్ట్ చేసిన రాజమౌళి అదే టైటిల్ ని పర్మనెంట్ గా ఫిక్స్ చేశాడు. అయితే త్రిబుల్ ఆర్ కి సరిపోయే ఫుల్ ఫామ్ ని మాత్రం ఆడియన్సే డిసైడ్ చేయాలని కోరాడు. అందుకే రాజమౌళి టైటిల్ విషయాన్ని ఆడియన్స్ కే వదిలేశాడు. ఇంకేముంది RRR కి రకరకాల ఫుల్ ఫామ్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్.     

ఈ టైటిల్ కి ఆడియన్స్ తమకు నచ్చిన పదాలతో ఫుల్ ఫిల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా అందులోంచి కొన్ని టైటిల్స్ ని మూవీటీం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో రఘుపతి రాఘవ రాజారాం, రాజ్యం రణం రక్తం, రాముడు రుద్రుడు రణరగం లాంటి తెలుగు టైటిల్స్ తో పాటు రాగ్ రంగ్ రణ్, రుద్ర రణ రూపం లాంటి హిందీ టైటిల్స్ ఉన్నాయి. వీటితోపాటు రెబల్ రివోల్ట్ రిపిట్ లాంటి ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నాయి. తమిళ్, కన్నడ, మలయాళం ఆడియన్స్ కూడా టైటిల్స్ ని పంపిస్తున్నారు. అన్నిటిలో రఘుపతి రాఘవ రాజారాం అనే టైటిల్ ఎక్కువగా హైలెట్ అవుతోంది. ఇక ప్రస్తుతం త్రిబుల్ ఆర్ షూటింగ్ హైద్రాబాద్ శివారులోని కోకాపేటలో జరుగుతోంది. ఎన్టీఆర్ మీద కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.