NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట! | Fans Want Srinidhi Shetty For NTR31

NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఎవరితో సినిమా చేస్తాడా అనే ప్రశ్నకు ఇటీవల తన పుట్టినరోజున సమాధానం ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివతో....

NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత ఎవరితో సినిమా చేస్తాడా అనే ప్రశ్నకు ఇటీవల తన పుట్టినరోజున సమాధానం ఇచ్చాడు. దర్శకుడు కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. ఇక అదే రోజున మరో బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. తన 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించబోతున్నట్లు తారక్ అనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల అనౌన్స్‌మెంట్‌తో తారక్ అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ 31వ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ కొత్త రచ్చ సాగుతోంది.

NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!

కేజీయఫ్ వంటి చిత్రాలను తెరకెక్కించి ఇండియావైడ్ గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను తారక్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తిగా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో నటీనటుల విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ అభిమానులు సూచిస్తున్నారు. అంతేగాక ఈ సినిమాలో కేజీయఫ్ చిత్రంలో నటించి మెప్పించిన శ్రీనిధి శెట్టినే హీరోయిన్‌గా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!

కేజీయఫ్ చిత్రంతో హీరోయిన్‌గా మారి, తొలి సినిమాతోనే అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ అయితే తారక్ పక్కన కొత్తగా కనిపిస్తుందని.. అంతేగాక ఈమెతో ప్రశాంత్ నీల్ చేసిని కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలు బాక్సాఫీస్‌ను దున్నేశాయని.. అందుకే తమ అభిమాన హీరో పక్కన ఈ బ్యూటీని తీసుకోవాలంటూ వారు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను కోరుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. మరి తారక్ ఫ్యాన్స్ కోరికను ప్రశాంత్ నీల్ సీరియస్‌గా తీసుకుంటాడా లేదా అనేది చూడాలి.

×