Fans War: మా హీరో తోపు.. మా హీరోనే తురుం.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

ఫ్యాన్స్ వార్ ఈమధ్య బాగా ఎక్కువైంది. సోషల్ మీడియా వాడకం పెరిగాక మాటల యుద్ధం ఓ లెవెల్ ను దాటేసింది. ఒకరిని మించి ఒకరన్నంటు హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

Fans War: మా హీరో తోపు.. మా హీరోనే తురుం.. రెచ్చిపోతున్న ఫ్యాన్స్!

Fans War

Fans War: ఫ్యాన్స్ వార్ ఈమధ్య బాగా ఎక్కువైంది. సోషల్ మీడియా వాడకం పెరిగాక మాటల యుద్ధం ఓ లెవెల్ ను దాటేసింది. ఒకరిని మించి ఒకరన్నంటు హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అసలు కొన్ని డిస్కషన్స్ అయితే మరీ విచిత్రంగా తయారవుతున్నాయి. టాపిక్ ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతోంది. సినిమా ఫ్లాప్ అయితే మరో హీరో అభిమానులను నిందిస్తూ కొందరైతే అతి చేసేస్తున్నారు.

Social Media Trolls: నచ్చితే ఆకాశానికే.. నచ్చకపోతే బూతులే!

సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది ఫ్యాన్స్ వార్. అప్పుడే తిట్టిపోస్తున్నారు. అంతలోనే కలిసి జై కొడుతున్నారు. ఇంతకు ముందైతే డైరెక్ట్ అటాక్ కనిపించేది ఇప్పుడైతే సోషల్ మీడియాలోనే కావాల్సినంత హంగామా సృష్టిస్తున్నారు. అందరూ కాదుకానీ కొందరైతే చిత్రవిచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. రాధేశ్యామ్ డిజాస్టర్ అవడానికి కారణాలను ఇంకా అన్వేషిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

రాధేశ్యామ్ ఫెయిల్యూర్ తో డైరెక్టర్ రాధాకృష్ణను విపరీతంగా ట్రోల్ చేస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొంతమంది.. పవన్, బన్నీ ఫ్యాన్స్ తో మాటల యుద్ధం చేసేస్తున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ నాటికి అప్పటికే థియేటర్స్ లో ఉన్న భీమ్లా నాయక్ కు వసూళ్లు తగ్గుతాయనే భయంతో.. పవన్ ఫ్యాన్స్ చాలామంది రాధేశ్యామ్ కు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారనేది ప్రభాస్ ఫ్యాన్స్ వర్షన్. ప్రభాస్ సినిమాకు థియేటర్స్ తగ్గడం వెనక గట్టి లాబీయింగ్ నడిచిందని, రిలీజైన థియేటర్స్ దగ్గర కూడా నెగెటివ్ టాక్ వచ్చేలా మౌత్ టాక్ ఇప్పించారనవి మొత్తానికి పవన్ ఫ్యాన్స్ బాగా దెబ్బకొట్టారని ప్రబాస్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

పవన్ ఫ్యాన్స్ పై మాత్రమే కాదు బన్నీ అభిమానులపై కూడా కోపం చూపిస్తున్నారు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్. చాన్నాళ్లుగా ఉన్న బన్నీ, ప్రభాస్ ఫ్యాన్స్ గొడవలు రాధేశ్యామ్ తో పీక్స్ కు చేరుకున్నాయి. చిన్న లింక్ దొరికితే చాలు సోషల్ మీడియాలో హద్దులు దాటే మాటలతో విజృంభిస్తారు వీళ్లు. అసలే కంటెంట్ తడబడిన రాధేశ్యామ్ సినిమాను మరింత డ్యామేజ్ చేయడంలో అల్లు అర్జున్ ఆర్మీ రోల్ కూడా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు డార్లింగ్ అభిమానులు. పుష్ప2 రాని చూసుకుంటామని కొందరైతే వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

ఆ హీరో ఈ హీరో అని కాదు స్టార్ డం ఉన్న హీరోల ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారు. కొంచెం తేడాగా అనిపించినా హద్దులు మీరి రియాక్ట్ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ విషయమే కానీ, వచ్చే మహేశ్ సర్కారు వారి పాట కానీ.. నెగటివ్ గా అనిపించిందా.. తగ్గేదే లే అన్నట్టు సోషల్ మీడియా యుద్ధం ప్రకటించేస్తున్నారు. కాస్త ఆలోచించాక కలిసిపోదాంలే అనుకుంటున్నారు.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

ట్రిపుల్ ఆర్ కన్నడ వెర్షన్ కు చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారని కర్ణాటకలో కొందరు అసహనం ప్రదర్శించారు. బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇంకేముంది కామన్ గానే చరణ్, తారక్ ఫ్యాన్స్ కు కోపం కట్టలు తెచ్చుకుంది. మీరు ఇలాగే చేయండి కేజీఎఫ్2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ కొందరు బెదిరించడం మొదలెట్టారు. కేజీఎఫ్ 2 రికార్డ్ కొట్టేలంటే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎంత కీలకమో గుర్తు చేశారు.

Star Heroins: కలెక్షన్ క్వీన్స్.. మార్కెట్ సెట్ చేస్తున్న హీరోయిన్స్!

ట్రిపుల్ ఆర్ తర్వాత 20 రోజుల గ్యాప్ తో కేజీఎఫ్2 రాబోతుండటంతో కన్నడ ఫ్యాన్స్ సైలెంటయిపోయారు. మనం మనం భాయి భాయి.. మన సౌత్ హీరోలు పాన్ ఇండియా హీరోలోయి.. లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్ అంటూ మాట మార్చేశారు. ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా చరణ్ తోపంటే.. తారక్ తురుమనే పోటీ మాటలు వినిపించాయి. అంతలోనే వాళ్లే ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు.. మనం కలిసి చూడటంలో తప్పేంటని సర్ధి చెప్పుకున్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తూ కన్నడ ఫ్యాన్స్ కేజీఎఫ్2 కోసం వెయిట్ చేస్తున్నారు.

Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!

సర్కారు వారి పాట కళావతి సాంగ్, బీస్ట్ అరబిక్ కుతూ.. పెన్నీ సాంగ్, జాలీ జింఖానా ఇలా పోటీ పడి రిలీజైన తమిళ్, తెలుగు పాటల కారణంగా మహేశ్, విజయ్ ఫ్యాన్స్ మధ్యా చిన్న వార్ నడించింది. హిట్ ట్రాక్ మాదంటే మాదని.. రికార్డ్ ఈ పాట కొట్టిందంటే మా పాట కొట్టిందనే వర్షన్ సోషల్ మీడియాలో కనిపించింది. అంతేనా ఏప్రిల్ 14న రాబోతున్నానని ముందే చెప్పిన కేజీఎప్2కి పోటీగా పాన్ ఇండియా వైడ్ ఏప్రిల్ 13న విజయ్ బీస్ట్ దిగుతుండటంతో కూడా విజయ్, యశ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!

పాన్ ఇండియా రేంజ్ ప్రభాస్ దని వాళ్లు.. పుష్పతో బన్నీ ఆ క్రేజ్ డబుల్ చేశాడని వీళ్లు.. రామ్ చరణ్ అదరగొట్టాడని కొందరు.. తారక్ ఇరగదీసాడని ఇంకొందరు.. తెలుగు సినిమాలో విషయముందని కొంతమంది.. బాలీవుడ్ ను వెనకేసుకొస్తూ ఇంకొంతమంది.. ఇలా సోషల్ మీడియాలో ఏ స్టార్ పోస్ట్ పెట్టినా ఏదోవిధంగా నెగటివ్ కామెంట్స్ చేయడం కొందరికి అలవాటైంది. దాన్ని చూసి నవ్వుకుని వదిలేయమే తప్ప సీరియస్ గా తీసుకొని మేము ఫాలో అవమని మాక్సిమమ్ స్టార్స్ లైట్ తీసుకుంటున్నారు.