Toofaan : టాలెంట్‌కి లవ్ యాడ్ అయితే ‘తూఫాన్’..

మల్టీటాలెంట్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఫరాన్‌ అఖ్తర్‌.. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో, బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా ‘తూఫాన్’..

Toofaan : టాలెంట్‌కి లవ్ యాడ్ అయితే ‘తూఫాన్’..

Toofaan

Toofaan: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సినిమాలకెప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. మల్టీటాలెంట్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఫరాన్‌ అఖ్తర్‌.. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో, బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమా ‘తూఫాన్’..

ఇప్పటివరకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తూఫాన్’ ట్రైలర్ బుధవారం రిలీజ్ చేశారు. ఫరాన్ ఈ క్యారెక్టర్ కోసం తనను తాను ఎంతో బాగా ట్రాన్స్‌ఫర్మ్ చేసుకున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ సీన్స్‌లో జీవించేశారు..

తనలోని టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేసిన ప్రేయసి కోసం బాక్సర్‌గా మారడం, చేసిన తప్పుకి ఐదేళ్లపాటు బాక్సింగ్ నుండి బ్యాన్ చెయ్యడం, తిరిగి మళ్లీ తనకిష్టమైన ప్రొఫెషన్‌లోకి ఎంటర్ అయ్యి విజయం సాధించడం వంటివి ట్రైలర్‌లో చూపించి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. స్పోర్ట్‌కి ఎమోషన్ యాడ్ అయితే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఫరాన్ అఖ్తర్ కోచ్‌గా పరేష్ రావెల్, ప్రియురాలిగా మృణాల్ ఠాకూర్ కనిపించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సెట్ అయ్యాయి. జూలై 16 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ‘తూఫాన్’ స్ట్రీమింగ్ కానుంది.