Raviteja: మాస్ రాజా మూవీలో జాతిరత్నాలు పాప.. ఏం చేస్తుందంటే?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ, థమాకా చిత్రాలు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి....

Raviteja: మాస్ రాజా మూవీలో జాతిరత్నాలు పాప.. ఏం చేస్తుందంటే?

Faria Abdullah As Raviteja Sister In Dhamaka

Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ, థమాకా చిత్రాలు ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్న పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ధమాకా’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మరోసారి డ్యుయెల్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Raviteja: రవితేజ పాత్ర అలా ఉండబోతుందా?

ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేం బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అయితే ఆమె చేయబోయే పాత్రకు సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా రవితేజ సోదరి పాత్రలో నటిస్తుందట. ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని, ఈ సినిమాలో మేజర్ ట్విస్ట్‌కు ఆమె పాత్రే కారణం అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!

ఇక ఈ సినిమాలో రవితేజ పాత్రలను చాలా అల్ట్రా స్టైలిష్‌గా డిజైన్ చేశాడట దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించుకుని చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా పాత్ర ఎలా ఉంటుందో, ఈ సినిమాకు ఆమె పాత్ర ఎలాంటి మలుపు ఇస్తుందో తెలియాలంటే ధమాకా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.