Fariya Abdullah : ‘బంగార్రాజు’ సినిమాలో చిట్టి స్పెషల్ సాంగ్??

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న 'బంగార్రాజు' సినిమాలో ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. ఇప్పటికే 'బంగార్రాజు' సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ వస్తున్నాయి.

Fariya Abdullah : ‘బంగార్రాజు’ సినిమాలో చిట్టి స్పెషల్ సాంగ్??

Bangarraju

 

Fariya Abdullah :  ‘జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఫరియా అబ్ధుల్లా. గతంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసినా ‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా తన నవ్వుతో, తన అల్లరితో, తన నటనతో, తన అందంతో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ‘చిట్టి చిట్టి’ పాటతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు ఫరియా హైదరాబాదీ అమ్మాయి కావడంతో అవకాశాలు బాగానే వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ అవకాశాలేవీ రాలేదు.

Pushpa : ‘పుష్ప’ సాంగ్ కోసం తన రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్

ఇటీవల మెల్లి మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి ఫరియాకి. ఇటీవల వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది. ‘ఢీ’ సినిమా సీక్వెల్ లో మంచి విష్ణు సరసన హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఫరియా గురించి మరో అప్ డేట్ పరిశ్రమలో వినిపిస్తుంది.

Bigg Boss 5 : కొత్త కెప్టెన్‌గా మానస్.. కాజల్‌తో గొడవలకు ఫుల్‌స్టాప్..

నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న ‘బంగార్రాజు’ సినిమాలో ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. ఇప్పటికే ‘బంగార్రాజు’ సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ కూడా విడుదల అవ్వనుంది. ఫరియా సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి డ్యాన్సర్. హిప్ హాప్‌, బి-బోయింగ్‌, బెల్లీ డ్యాన్స్.. ఇలా డిఫెరెంట్ డ్యాన్స్ లో ఫరియాకి మంచి అనుభవం ఉంది. తన సోషల్ మీడియా పేజీలో రెగ్యులర్ గా తన డ్యాన్స్ లను పోస్ట్ చేస్తూ ఉంటుంది. వీటికి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

Nayanatara : చిరంజీవి సినిమాలో నయన్‌కి భారీ పారితోషికం

ఇప్పుడు ఈ డ్యాన్స్ ని వెండితెరపై చూపించే అవకాశం వచ్చింది చిట్టికి. ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున సరసన స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. మరి ఈ స్పెషల్ సాంగ్ తో అయినా ఈ జాతిరత్నంకి అవకాశాలు వరుసగా వస్తాయేమో చూడాలి.