Fatima Sana: ఫాతిమా హాట్ పిక్స్.. అమిర్ కూతురు లైక్స్!

అమిర్ ఖాన్‌ స్టోర్స్‌ డ్రామా ‘దంగల్‌’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా ఇప్పుడు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసినట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఓటీటీలో విడుదలైన అజీబ్ దాసతాన్స్​లో నటించిన ఫాతిమా ప్రస్తుతం ఆరువి హిందీ రీమేక్​లో నటిస్తోంది.

10TV Telugu News

Fatima Sana: అమిర్ ఖాన్‌ స్టోర్స్‌ డ్రామా ‘దంగల్‌’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా ఇప్పుడు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసినట్లు కనిపిస్తుంది. ఈ మధ్యనే ఓటీటీలో విడుదలైన అజీబ్ దాసతాన్స్​లో నటించిన ఫాతిమా ప్రస్తుతం ఆరువి హిందీ రీమేక్​లో నటిస్తోంది. కాగా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు వరస పెట్టి ఫోటో షూట్స్ చేస్తూ అవి తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంది.

హీరోయిన్స్ అందరూ ఇలా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫిల్మ్ మేకర్స్ కు గాలమేయడం సహజమే అయినా ఫాతిమా ఇందులో మరీ ఫాస్ట్ గా ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో రోజుకో పిక్ అయినా పోస్ట్ చేయనిదే ఫాతిమాకు రోజు గడవడం లేదు. ఇక ఈ భామ ఫోజులకు అవి వైరల్ కాకుండా ఉండడం లేదు. ఎప్పటిలాగానే ఆదివారం కూడా ఇన్ స్టాలో ఫాతిమా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. వాటికి మంచి లైక్స్ కూడా వస్తున్నాయి.

అయితే.. ఫాతిమా ఇన్ స్టా ఫోటోలకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్​ లైక్​ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ మధ్యనే అమిర్ భార్య కిరణ్ రావుతో వివాహ బంధానికి వీడ్కోలు చెప్పేశాడు. దానికి కారణం ఫాతిమా అనే రూమర్స్ బలంగా వినిపించాయి. అయితే, ఇప్పుడు అమిర్ కూతురు ఐరా ఫాతిమా ఫోటోలకు లైక్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. అన్నట్లు.. ఫాతిమా పోస్ట్ చేసే ఫోటోలకు ఆమె బాయ్ ఫ్రెండ్ నుపుర్​ శిఖరే కూడా లైక్స్ ఇచ్చాడు.

10TV Telugu News