Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

నిజంగా కొవిడ్ నిద్రపోనివ్వట్లేదు టాలీవుడ్ హీరోలని. థియేటర్స్ లో ఊపొచ్చింది.. ఇక మనం తగ్గేదే లే అనుకుంటోన్న టైంలో దెబ్బ కొట్టేస్తోంది. అందుకే 2022లో కొత్తగా మళ్లీ వాయిదా లీడ్..

Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

Movie Releases

Movie Releases: నిజంగా కొవిడ్ నిద్రపోనివ్వట్లేదు టాలీవుడ్ హీరోలని. థియేటర్స్ లో ఊపొచ్చింది.. ఇక మనం తగ్గేదే లే అనుకుంటోన్న టైంలో దెబ్బ కొట్టేస్తోంది. అందుకే 2022లో కొత్తగా మళ్లీ వాయిదా లీడ్ తీసుకున్నాయి ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్. మరీ సినిమాల బాటలో మరిన్ని పెద్ద సినిమాలు చేరబోతున్నాయా..? మాకూ తప్పట్లేదని త్వరలోనే ఫ్యాన్స్ కు స్టార్స్.. షాక్ ఇవ్వబోతున్నారా..? అన్న చర్చ జరుగుతుంది.

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

వాయిదాపర్వం రిపీట్ కాబోతుందా… స్టార్స్ సినిమాలన్నీ కొత్త డేట్స్ వేతుక్కోవాల్సిందేనా… ఇప్పుడివే ప్రశ్నలు ఇండస్ట్రీని నిద్రలేకుండా చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ రాలేమని తేల్చేశాయి.. తప్పుకున్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్స్ తోనే ఇబ్బందిపడుతున్న టాలీవుడ్.. ఇప్పుడు 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఛాన్స్ తీసుకునేలా లేదు. ప్రస్తుతం షూటింగ్స్ సజావుగా సాగట్లేదు. ముందు ముందు పరిస్థితులెలా మారుతాయో అర్ధం కావట్లేదు. అందుకే వాయిదా అని మరికొందరు స్టార్స్ ప్రకటించే అవకాశం ఉంది.

Boyapati-Pawan: బోయపాటితో పవర్ స్టార్.. ఇది సెట్టయ్యే కాంబినేషనేనా?

ఫిబ్రవరి 4న రిలీజ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఆచార్యను ఆ డేట్ కు తీసుకురావడం కష్టమే. పెరుగుతున్న కొవిడ్ ఆంక్షలు రిలీజ్ కు బ్రేకలు వేస్తున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా వైడ్ ఎంట్రీ ఇచ్చాకే.. ఆచార్యను తీసుకురావాలనే సెంటిమెంట్ కూడా ఉంది. సో ఆ లెక్క ప్రకారం ముందు ఆర్ఆర్ఆర్ జనాల ముందుకు రావాలి. ఆ తర్వాతే ఆచార్యతో కలిసి సిద్ధ రంగంలోకి దిగుతాడు. అందుకే ఎలా చూసుకున్నా ఫిబ్రవరి 4 నుంచి చిరూ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి.

Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

సర్కారు వారి పాటకు రెండున్నర నెలల గ్యాప్ ఉంది. కానీ ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ మాత్రం కష్టంగానే ఉంది. ఈమధ్యే మోకాలి సర్జరీ చేయించుకున్న మహేశ్ బాబుకు కొవిడ్ సోకడంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్నా.. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. వచ్చే నెలలోనే రీస్టార్ట్ చేస్తారని అంటున్నారు. అదీ అన్నీ బాగుండి కొవిడ్ కేసులు, ఆంక్షలు లేకుండా ఉంటే. అందుకే సర్కారు వారి పాట మేకర్స్ కొత్త డేట్ గురించి ఆలోచిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కూడా పండక్కి ఉండకపోవచ్చు.

OTT Release: సరుకు సిద్ధం.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

పరిస్థితి ముదిరితే ఫిబ్రవరి 11న రావాల్సిన మాస్ రాజా ఖిలాడి కూడా ఆగిపోయే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతోన్న భీమ్లానాయక్ పరిస్థితి సేమ్ టు సేమ్. కొవిడ్ కేసులు తగ్గేదాకా భీమ్లానాయక్ మిగిలిన పార్ట్ పూర్తి చేసేలా కనిపించడం లేదు పవన్ కల్యాణ్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటయితే ఫిబ్రవరి 25కు తీసుకురావడం కుదరకపోవచ్చు.