‘బేబమ్మా’.. ఉప్పెన ఫస్ట్ వేవ్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ మూవీ నుండి ఫస్ట్ వేవ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 5, 2020 / 05:21 AM IST
‘బేబమ్మా’.. ఉప్పెన ఫస్ట్ వేవ్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ మూవీ నుండి ఫస్ట్ వేవ్ రిలీజ్..

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుదర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు.

ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘ఉప్పెన’ మూవీతో కృతి శెట్టి కథానాయికగా, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరో సముద్రంలో ఎగసిపడుతున్న అలలకు ఎదురు నిలబడి ‘బేబమ్మా’ అని బిగ్గరగా అరవడంతో పాటు, హీరోయిన్ ఫేస్ కొంచెం చూపించారు. హీరోని ఎప్పటిలానే వెనకనుండి చూపించారు.

ప్రేమ, కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. కెమెరా : శ్యామ్ దత్ సైనుద్దీన్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : మౌనిక రామకృష్ణ, ఫైట్స్ : వెంకట్, కొరియోగ్రఫీ : బృంద, ప్రేమ్ రక్షిత్, సీఈఓ : చెర్రీ, సమర్పణ : సుకుమార్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్.