Brahmanandam : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో.. ఉగాది నాడు బ్రహ్మానందానికి ఘన సన్మానం..

తాజాగా ఈ ఏడాది ఉగాది రోజున బ్రహ్మానందంను FNCC ( ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) కమిటీ సత్కరించబోతోంది. ఉగాది రోజు అంటే ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మానందంను ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి..................

Brahmanandam : ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో.. ఉగాది నాడు బ్రహ్మానందానికి ఘన సన్మానం..

Felicitation to Brahmanandam on Ugadi by FNCC Committee

Brahmanandam :  కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో తన కామెడీతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు. అయితే బ్రహ్మానందం గత కొంతకాలంగా రెగ్యులర్ గా సినిమాలు చెయ్యట్లేదు. చాలా అరుదుగా, సెలెక్టీవ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా సినిమా ఈవెంట్లలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అలాగే తన ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు బ్రహ్మానందం. తన ఫ్యామిలీతో సరదాగా గడిపే సన్నివేశాలను ఫోటోల రూపంలో తన తనయుడు గౌతమ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తున్నాడు.

తాజాగా ఈ ఏడాది ఉగాది రోజున బ్రహ్మానందంను FNCC ( ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) కమిటీ సత్కరించబోతోంది. ఉగాది రోజు అంటే ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మానందంను ఘనంగా సత్కరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఈ ఈవెంట్ ఫిలింనగర్ లోని FNCC కార్యాలయంలోనే జరగనుంది.

Kabjaa : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జ సినిమాలు ఏ ఓటీటీలో రానున్నాయో తెలుసా?

తాజాగా నేడు ఉదయం FNCC కమిటీ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఉగాది నాడు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరారు. ఇందుకు బ్రహ్మానందం అంగీకరించారు. ఈ నేపథ్యంలో FNCC సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, కమిటీ మెంబర్ పెద్దిరాజు, గోపాలరావు, కమిటీ వైస్ చైర్మన్ సురేష్ కొండేటి బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు.