కత్తి పట్టిన కత్తిలా ఉన్నాడు

విజయదశమి  సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ NBK 105 కొత్త పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 10:47 AM IST
కత్తి పట్టిన కత్తిలా ఉన్నాడు

విజయదశమి  సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ NBK 105 కొత్త పోస్టర్ రిలీజ్..

NBK 105 అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానుల ఉత్కంఠతకు తెరపడింది. గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్కపెడుతూ.. 03.55 నిమిషాలు ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆత్రుతగా ఎదురూ చూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి భారీ స్పందన వచ్చింది. 59 ఏళ్ల వయసులో బాలయ్య లుక్ అండ్ మేకోవర్ చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.

అక్టోబర్ 6 ఆదివారం రిలీజ్ చేసిన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయదశమి  సందర్భంగా ప్రేక్షకాభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో బాలయ్యను చూస్తే కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు. ఒంటినిండా పసుపు కుంకుమ, చేతిలో నెత్తురోడుతున్న కత్తితో ఉన్న లుక్ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి హోమం చేస్తుండగా జరిగే ఫైట్‌లో బాలయ్య ఇలా కత్తి పట్టుకుని ఉగ్రనరసింహావతారంలో కనిపిస్తాడట.

Read Also : అల వైకుంఠపురములో – దసరా శుభాకాంక్షలు..

అక్టోబర్ 14 నుండి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. కథ : పరుచూరి మురళిమాటలు : ఎమ్.రత్నం, సంగీతం : చిరంతన్ భట్, ఆర్ట్ : చిన్నా, కెమెరా : సి. రామ్ ప్రసాద్, స్ర్కీన్ప్లే, దర్శకత్వం : కె.ఎస్.రవికుమార్..