Poonam Kaur : అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులేనని వెల్లడించింది.

Poonam Kaur : అబార్షన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్‌కు మహిళలు ఎవరైనా అర్హులేనని వెల్లడించింది. మెడికల్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం..ఒంటరి, అవివాహిత మహిళలు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉందని సూచించింది. అయితే రూల్స్ ప్రకారం 24 వారాల గర్భాన్ని మాత్రమే తొలగించుకునే అవకాశం ఉందని సుప్రీంకోర్లు వెల్లడించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
సుప్రీంకోర్లు ఇచ్చిన ఈ తీర్పుపై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెట్టింట తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతిస్తూ..గర్భం దాల్చిన తర్వాత పురుషులు తమ రిలేషన్ షిప్‌కు కట్టుబడి ఉండమని బలవంతం చేయడం తాను చూశానని పూనమ్ కౌర్ చెప్పారు. తీర్పు నేపథ్యంలో పూనమ్ స్పందిస్తూ..సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు ఇస్తున్నా. స్త్రీలు పెళ్లిని, ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు గర్భం దాల్చడం చూశానని అన్నారు.
కానీ ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుందన్నారు. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదని సూచించిచారు. పూనమ్ చేసిన ఈ కామెంట్స్ ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా ఉన్నాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.