చిన్నప్పటి బాహుబలిని ఇప్పుడు చూశారా

చిన్నప్పటి బాహుబలిని ఇప్పుడు చూశారా

bahubali baby girl photos : టాలీవుడ్ దర్శక ధీరుడిగా పేరు గడించిన రాజమౌళి..దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ మూవీ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. బాక్సాపీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించి..సినిమాలో నటించిన వారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవుడిగా రానాలు మెప్పించారు. శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

అయితే..బాహుబలి – ది బిగినింగ్ శివగామి తన చేతిలో ఉన్న చిన్నారి నీట మునగకుండా..పైకి లేపి..ముందుకు సాగడం అందర్నీ ఆకట్టుకుంది. మహేంద్ర బాహుబలి బతకాలి అంటూ ఆమె తుదిశ్వాస విడవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. పసిబిడ్డను ఎత్తుకుని నీటి ప్రవాహానికి ఎదురువెళ్లడం, రెండు చేతుల్లోని చిన్నారి పోస్టర్ అప్పట్లో విపరీతంగా వైరల్ గా మారింది. ఆ చిన్నారిని చిన్నప్పటి ప్రభాస్ గా చూపించారు.

ఈ పాత్ర పోషించింది తన్వి అనే అమ్మాయి. ఇప్పుడు ఆమె పెద్దదవుతోంది. స్కూల్ కు కూడా వెళుతోంది. కొందరు తన్వితో దిగిన ఫొటోలు ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప (మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతోంది. పేరు తన్వి అంటూ…దొంతు రమేష్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.