Film Chamber: సినిమా కార్మికుల సమ్మెపై ఫిలిం ఛాంబర్ సమావేశం

టాలీవుడ్‌లో సమ్మె సైరెన్ మోగింది. తెలుగు సినిమా కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. బుధవారం నుండి ఎలాంటి సినిమా షూటింగ్‌లకు తాము....

Film Chamber: సినిమా కార్మికుల సమ్మెపై ఫిలిం ఛాంబర్ సమావేశం

Film Chamber Meeting Due To Movie Workers Strike

Film Chamber: టాలీవుడ్‌లో సమ్మె సైరెన్ మోగింది. తెలుగు సినిమా కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. బుధవారం నుండి ఎలాంటి సినిమా షూటింగ్‌లకు తాము హాజరుకాబోమని వారు తేల్చి చెప్పేశారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 24 విభాగాలకు చెందిన కార్మికలు వేతనాలు తప్పనిసరిగా పెంచాల్సి ఉంటుంది. కానీ కరోనా కారణంగా తమ వేతనాలు పెంచకపోగా, ఇప్పుడు పెంచమని కోరుతున్నా, నిర్మాతలు తమ మనవిని పెడచెవిన పెడుతున్నారని కార్మికులు మండి పడుతున్నారు.

Tollywood Strike: ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్‌ల మధ్య ముదిరిన వివాదం

అయితే సినీ కార్మికులు ఇలా అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం ఏమాత్రం సబబు కాదని ఫిలిం ఛాంబర్ అంటోంది. సమ్మెకు వెళ్లేముందు ఫిలిం ఛాంబర్‌కు నోటసులు ఇవ్వాలని.. అలా చేయకుండా నేరుగా సమ్మెకు దిగడం ఏమిటని ఫిలిం ఛాంబర్ ప్రశ్నిస్తుంది. అయితే తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయినా కూడా ఫిలిం ఛాంబర్ తమ మనవిని పెడచెవిన పెట్టిందని.. అందుకే ఇప్పుడు ఈ బంద్‌కు పిలుపునిచ్చామని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.

Telugu Film Industry: టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు

కాగా, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ఫిలిం ఛాంబర్ సభ్యులు అంటున్నారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. కార్మికుల వేతనాలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్మాతల మండలితో చర్చించేందుకు ఫిలిం ఛాంబర్ రెడీ అవుతోంది. మరి ఈ సమ్మెపై ఫిలిం ఛాంబర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.