Movie Shootings : వివాదం ముగిసినట్టేనా? ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్.. ‌

గత రెండు రోజులుగా వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు చాలా నష్టపోయారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాల గురించి వివాదం పెరిగి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని............

Movie Shootings : వివాదం ముగిసినట్టేనా? ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్.. ‌

Tollywood

Movie Shootings :  గత రెండు రోజులుగా వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీని వల్ల షూటింగ్స్ ఆగిపోయి నిర్మాతలు చాలా నష్టపోయారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాల గురించి వివాదం పెరిగి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని దాకా వెళ్ళింది. తలసాని ఆధ్వర్యంలో రెండు వర్గాలు చర్చించుకొని ఓ కొలిక్కి వచ్చారు. తలసానితో మీటింగ్ అనంతరం ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశాయి.

ప్రెస్ మీట్ లో నిర్మాతల మండలి అధ్యక్షుడు నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ… తలసాని గారి చొరవతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సుధీర్ఘ సమావేశం జరిగింది. రేపటి నుంచి యధావిధిగా చిత్రీకరణలు జరుగుతాయి. వేతనాలు రేపు కో ఆర్డినేషన్ కమిటీ వేసి దాని ఆధ్వర్యంలో ఛాంబర్, ఫెడరేషన్ కలిసి డిసైడ్ చేసి ఆమోదించటం జరుగుతుంది. విధివిదానాలను దిల్ రాజు చైర్మన్ గా ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటి ద్వారా నిర్ణయిస్తాము అని తెలిపారు.

చైతూ-కృతిశెట్టి కాంబో రెండోసారి.. పూజా కార్యక్రమాలతో మొదలైన NC22..

ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. సమావేశంలో అన్ని విషయాలపై మాట్లాడుకున్నాము. వేతనాలు పెంచటానికి నిర్మాతలు సిద్దమయ్యారు. రేపటి నుంచి కార్మికులు చిత్రీకరణలకు వెళతారు. అన్ని సమస్యలను కోఆర్డినేషన్ కమిటీ ద్వారా సాల్వ్ చేసుకుంటాము అని తెలిపారు. రేపటి నుంచి యధాతధంగా షూటింగ్స్ జరగనున్నాయి.