2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

చిన్న సినిమాల సీజన్ అయిపోయింది. అసలు ఆడియన్స్ ధియేటర్లకు వస్తారో లేదో, అని భయపడుతూ ఉన్న మేకర్స్ కి అఖండ 100కోట్ల కలెక్షన్లతో అదిరిపోయే సక్సెస్ ఇచ్చింది.

2022 Film Releases: ముందుంది అసలైన సినిమా పండగ..!

2022 Film Releases

2022 Film Releases: చిన్న సినిమాల సీజన్ అయిపోయింది. అసలు ఆడియన్స్ ధియేటర్లకు వస్తారో లేదో, అని భయపడుతూ ఉన్న మేకర్స్ కి అఖండ 100కోట్ల కలెక్షన్లతో అదిరిపోయే సక్సెస్ ఇచ్చింది. ఆదెబ్బతో రిలీజ్ డేట్స్ అన్నీ లాక్ చేసుకుంటున్నాయి పెద్ద సినిమాలు. 2021లో అంతగా పెద్ద సినిమాల్ని ఎక్స్ పీరియన్స్ చెయ్యని ఆడియన్స్ 2022 లో వరసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవ్వడంతో ముందు ముందు పెద్ద సినిమాల జాతరే అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ ఇయర్ కోవిడ్ తో అంతగా స్టార్ హీరోల సినిమాల్ని ధియేటర్లో చూడలేకపోయారు ఆడియన్స్. ఏదో ఒకటి అరా రిలీజ్ అయినా.. పెద్ద సినిమాల సందడిని ఎక్స్ పీరియన్స్ చెయ్యలేకపోయారు. కానీ వచ్చేసంవత్సరం అంతా ధియేటర్లో పెద్ద సినిమాల జాతరే. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్పతో స్టార్ట్ అయిన పెద్ద సినిమాల పండగ.. నెక్ట్స్ ఇయర్ ఎండ్ వరకూ కంటిన్యూ అవబోతోంది.

Pushpa: పబ్లిక్ టాక్.. ప్రేక్షకుల హృదయాలను దోచేసిన ఐకాన్ స్టార్!

వచ్చే 2022ని గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతోంది ట్రిపుల్ఆర్. ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ట్రిపుల్ఆర్ జనవరి 7న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ మూవీ 450 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ విజువల్ ట్రీట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, వీడియోస్ తో ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు.

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

జనవరి సెకండ్ వీక్ లో ఈ పెద్ద సినిమాల జాతర పీక్స్ కి చేరబోతోంది. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమా జనవరి 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాగర్ చంద్ర డైరెక్షన్లో సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లో వస్తామంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పవర్ స్టామ్ తో వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Rashmika Mandanna: క్రస్మిక అందాల వల.. పుష్ప ప్రమోషన్స్‌లో గ్లామర్ షో!

బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఫాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ తో ఆ ఫీవర్ని ఇంకాస్త పెంచబోతున్నారు. మూడేళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ జనవరి 14న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా భారీ స్కేల్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రాధేశ్యామ్.. పాన్ ఇండియా వైజ్ పెద్దసినిమాగా ఆడియన్స్ ముందుకొస్తోంది. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఆచార్య ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతూ నెలకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతోంది. తండ్రీకొడుకుల క్రేజీ కాంబినేషన్లో రిలీజ్ కురెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే ఆఢియన్స్ లో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఇప్పటి వరకూ గెస్ట్ రోల్స్ ప్లే చేసిన ఈ ఇద్దరూ..ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్స్ చెయ్యడంతో సినిమా మీద ఫుల్ హైప్స్ క్రియేట్ చేసింది.