The Batman హీరోకు కరోనా!

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 05:56 AM IST
The Batman హీరోకు కరోనా!

Robert Pattinson ‘tests positive : కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. పలువురు చనిపోయారు కూడా. సినీ రంగానికి చెందిన కొంతమందికి కరోనా వైరస్ సోకుతోంది. దీని ఫలితంగా షూటింగ్స్, సినిమాల విడుదల నిలిచిపోయాయి. కొంతమంది షూటింగ్ కొనసాగిస్తున్నారు. హాలీవుడ్ కు చెందిన నటుడు బ్యాట్ మెన్ హీరో రాబర్ట్ పాటిసన్ కు కరోనా వచ్చిందని వార్తలు వెలువడుతున్నాయి.



దీంతో లండన్ లో జరుగుతున్న ‘బ్యాట్ మెన్’ చిత్రీకరణనను పోస్ట్ పోన్డ్ చేశారు. బ్యాట్ మెన్ చిత్ర టీంలో ఓ కీలక వ్యక్తికి కరోనా సోకడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ…ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వెల్లడించారు. అయితే..ఇక్కడ ఆ కీలక వ్యక్తి ఎవరనేది వెల్లడించకోవడం గమనార్హం. కానీ..హీరో రాబర్ట్ పాటిసన్ కు కరోనా సోకిందన్నది హాలీవుడ్ లో టాక్. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
https://10tv.in/covid-19-can-wreck-your-heart-even-if-you-havent-had-any-symptoms/
గతంలో బ్యాట్‌మ్యాన్‌ సీరీస్‌ చిత్రాల్లో నటించిన బెన్‌ అప్లెక్‌ తప్పుకున్నారు. దాంతో ఈ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్‌ నటిస్తున్నారు. మాట్ రీవ్స్ డైరెక్ట్ చేస్తున్న ‘ద బ్యాట్‌మ్యాన్’ షూటింగ్ ఈ ఏడాది జనవరిలో మొదలైంది. 2021 మధ్యలో సినిమా విడుదల చేసేందుకు చిత్ర టీం ప్రయత్నాలు చేస్తోంది.



ఈ క్రమంలోనే..బ్యాట్‌మ్యాన్ ఫ్యాన్స్‌ను అలరించేలా నిర్మాతలు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మార్చి నుంచి షూటింగ్ ఆగిపోయింది. తాజాగా చిత్ర టీంలో ఒకరికి కరోనా సోకడంతో సినిమా విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.