Oscar Nominated Indian Movies : భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాలివే..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. ఈ నామినేషన్స్ లో RRR ఉండాలి అని కోరుకున్న వరల్డ్ వైడ్ ఆడియన్స్ కల నెరవేరింది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. కాగా భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాలు ఏంటో తెలుసా?

Oscar Nominated Indian Movies : భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాలివే..

Films nominated for Oscars in the history of Indian cinema

Oscar Nominated Indian Movies : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. ఈ నామినేషన్స్ లో RRR ఉండాలి అని కోరుకున్న వరల్డ్ వైడ్ ఆడియన్స్ కల నెరవేరింది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సాంగ్ ఎంపిక అయ్యింది. ఇక భారత్ ప్రభుత్వం అధికారికంగా ఆస్కార్ కి పంపించిన ‘ది లాస్ట్ ఫిలిం షో’ తుది జాబితాలో స్థానం దక్కించుకోలేక పోయింది. కాగా భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఆస్కార్‌కి నామినేట్ అయిన చిత్రాలు ఏంటో తెలుసా?

Oscar Best Picture Nominations : ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కి నామినేట్ అయిన 10 సినిమాలు ఇవే.. ఎక్కడ చూడొచ్చు??

1957 నుంచి ఇప్పటి వరకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న చిత్రాలు మొత్తం నాలుగు ఉన్నాయి. ఇండియన్ ఫిలిం కెరీర్ లో ఇప్పటివరకు భారత్ నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్‌కి వెళ్ళింది దాదాపు 54 చిత్రాలు. ఈ 54 సినిమాల్లో తెలుగు నుంచి కె విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ కూడా ఉంది. కానీ నామినేషన్ లిస్ట్ లో స్థానం సంపాదించలేకపోయింది. ఈ షార్ట్ లిస్ట్‌ నుంచి నామినేషన్స్ కి వెళ్లిన సినిమాలు మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్.

మొట్ట మొదటిసారిగా 1957లో భారతదేశం తరుపు నుంచి ‘మదర్ ఇండియా’ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఈ చిత్రం ఎంపిక అయ్యింది. ఒక భారతీయ తల్లి తన పిల్లలు కోసం, తన కుటుంబం కోసం పడే కష్టాలను ఈ చిత్రంలో గుండెకు హత్తుకునేలా చిత్రీకరించారు. దేశంలోని గ్రామాల పరిస్థితిని కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఈ సినిమా తరువాత దాదాపు 31 ఏళ్ళ తరువాత ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో మరో భారతీయ సినిమా చోటు దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘సలాం బాంబే’ అనే సినిమా 1988 ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ముంబై మురికివాడలో నివసించే విధి పిల్లల జీవితాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

మళ్ళీ 2001లో ‘లగాన్’ సినిమాతో భారతీయ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. ఈ చిత్రం కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలోనే ఎంపిక అయ్యింది. ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించాడు. కథ విషయానికి వస్తే.. బ్రిటిషర్లు నుంచి పన్ను మినహాయింపు కోసం భారతీయులు, బ్రిటిషర్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతారు. అసలు క్రికెట్ అంటే కూడా తెలియని ఆ గ్రామస్తులు ఎలా ఆ మ్యాచ్ గెలిచారు అనేది మిగతా కథ.

కాగా ఈ మూడు చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యింది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలోనే. ఇప్పుడు RRR నామినేట్ అయ్యింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో. ఈ కేటగిరీలో ఎంపికైన తొలి సినిమా RRR.