Films Release Crash: కోవిడ్ క్రాష్.. సరిచేసే పనిలో టాలీవుడ్ మేకర్స్

కొవిడ్ తో తప్పిన లెక్కల్ని మరోసారి సరిచేసే పనిలో ఉన్నారు టాలీవుడ్ మేకర్స్. రిలీజ్ ల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి డేట్ వాళ్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆచార్య ఏప్రిల్ 1..

Films Release Crash: కోవిడ్ క్రాష్.. సరిచేసే పనిలో టాలీవుడ్ మేకర్స్

Films Release Crash

Films Release Crash: కొవిడ్ తో తప్పిన లెక్కల్ని మరోసారి సరిచేసే పనిలో ఉన్నారు టాలీవుడ్ మేకర్స్. రిలీజ్ ల విషయంలో కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి డేట్ వాళ్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆచార్య ఏప్రిల్ 1 అని చెప్పేశాడు. మిగిలిన స్టార్స్ కూడా అదే బాటలో ఆలోచిస్తున్నారు. కొవిడ్ ఎఫెక్ట్ తో వాయిదాపడ్డ సినిమాలన్నీ కొత్త డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. మళ్లీ వీటి మధ్య క్లాష్ రాకుండా జాగ్రత్తపడుతున్నారు మేకర్స్.

Bangarraju: అక్కినేని హీరోలకు బంగారు బాతుగా సంక్రాంతి!

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో ట్రిపుల్ ఆర్ ఏప్రిల్ 29న వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 1న ఆచార్య రాబోతున్నట్టు తేల్చేశారు. ముందు ట్రిపుల్ ఆర్ వచ్చాకే ఆచార్యను రిలీజ్ చేయాలనుకున్నా.. చివరికి చిరూ కాంప్రమైజ్ కాక తప్పట్లేదని అర్ధమవుతుంది. అయితే ఏదైనా మ్యాజిక్ జరిగి మార్చిలోనే ట్రిపుల్ ఆర్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

NTR 30: తారక్ జోడీగా నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో మరో క్రేజీ ఆఫర్!

మార్చి 25 కానీ మే నెలలో కానీ భీమ్లానాయక్ గా కనిపించే అవకాశం ఉంది పవర్ స్టార్. జనవరి 12న రిలీజ్ కావల్సిన భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ డేట్ కు కూడా పవన్ – రానా మూవీ రావడం కష్టమే. ఫిబ్రవరిలో కొవిడ్ కేసులు పీక్స్ లో ఉంటాయనే అంచనాల కారణంగా ఫిబ్రవరి 25 నుంచి భీమ్లానాయక్ ను తప్పించబోతున్నట్టు హింట్స్ అందుతున్నాయి.

Ala Vaikunthapurramuloo: పుష్ప ఇచ్చిన జోష్.. హిందీలో బన్నీ సినిమా!

ఏప్రిల్ 1న ఆచార్య వస్తుంటే సర్కారు వారి పాట వచ్చే చాన్సెస్ తక్కువే. ఓ పక్క మహేష్ మోకాలి సర్జరీ రెస్ట్, కొవిడ్ అటాక్ తో ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వుంది. మరో పక్క సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా 30 రోజుల బ్యాలెన్స్ వుంది. కొవిడ్ పూర్తిగా తగ్గితే ఈ షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరు లో స్టార్ట్ అవుతుంది. రిలీజ్ సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైమ్ సరిపోదు. సో ఏప్రిల్ ఫస్ట్ కి కూడా సూపర్ స్టార్ మూవీ వాయిదా పడితే మేలో రిలీజ్ కు సన్నాహాలు చేస్తారు అనే టాక్ వైరల్ అవుతుంది.

RRR: ఆర్ఆర్ఆర్ వాయిదా పడినా బాధలేదు.. చెర్రీ భావోద్వేగం!

ఫిబ్రవరి నెలలో కూడా కరోనా తీవ్ర స్థాయిలో కొనసాగితే రిలీజ్ డేట్ లు ప్రకటించిన సినిమాలు తారుమారవక తప్పదు. ఫిబ్రవరి 11న రిలీజ్ కావాల్సిన మేజర్, ఖిలాడి సినిమాలతో పాటూ ఫిబ్రవరి 18న రిలీజ్ కావాల్సిన నిఖిల్ 18 పేజెస్ కొవిడ్ గండాన్ని దాటుతుందా అన్నది చూడాలి.