ప్రముఖ నటితో అసభ్య ప్రవర్తన : ఇద్దరిపై పోలీస్ కేసు నమోదు

బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కొడాకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 02:55 PM IST
ప్రముఖ నటితో అసభ్య ప్రవర్తన : ఇద్దరిపై పోలీస్ కేసు నమోదు

బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కొడాకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో

బెంగళూరు : ప్రముఖ కన్నడ నటి హర్షిక పునాచాతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కొడాకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మడికెరిలో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో ఈ ఘటన జరిగింది. బన్సి నానయ్య, బిపిన్ దేవయ్య అనే ఇద్దరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి హర్షిక మడికెరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మడికెరిలోని నీరుకెల్లు రిసార్ట్ లో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి నటి హర్షిక మరో యాక్టర్ భువన్ తో కలిసి వెళ్లింది. ఈ సమయంలో నానయ్య, బిపిన్ తనతో అనుచితంగా ప్రవర్తించారని హర్షిక తెలిపింది. అంతేకాదు వారితో గొడవ కూడా జరిగింది. ఈ గొడవలో భువన్ కి గాయాలు అయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లిపోయారు.

నటి హర్షిక నుంచి ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. అనుచితంగా ప్రవర్తించిన వాళ్లిద్దరూ సోదరులు అని చెప్పారు. యాక్టర్ కి బంధువులు అవుతారని వివరించారు. నిందితులపై ఐపీసీ 354 (దాడి), 324 (ఉద్దేశపూర్వకంగా ఆయుధాలతో దాడి చెయ్యడం), 326 ( వెపన్స్ తో గాయపర్చడం) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో హర్షిక పాపులర్ నటి. 15 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. 2008లో వచ్చిన పీయూసీ సినిమాతో పాపులర్ అయ్యింది. తెలుగు, మలయాళం, కొంకణి సినిమాల్లోనూ నటించింది.