Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు సెట్స్‌లో అగ్ని ప్రమాదం..

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ వచ్చే వారం మొదలు కాబోతుంది అనుకుంటే.. ఇంతలో ఆ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు సెట్స్‌లో అగ్ని ప్రమాదం..

fire accident at pawan kalyan Hari Hara Veera Mallu sets

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టుకున్నప్పటికీ.. అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG షూటింగ్స్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

Bro : మామా అల్లుళ్ళ డబుల్ బొనాంజా ట్రీట్.. కొత్త పోస్టర్ రిలీజ్!

ఇక వచ్చే వారం నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ ని కూడా ప్రారంభించడానికి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మేజర్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌ దుండిగల్ బౌరంపేటలో ఒక భారీ సెట్ ని నిర్మించారట. ఇక వచ్చే వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది అనుకుంటే.. ఇంతలో వీరమల్లు సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కురిసిన భారీ వర్షం వల్ల సెట్ కి కొంత ధ్వంసం అయ్యిందట. దానిని మరమ్మతు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Adipurush : ఆదిపురుష్ నుంచి మరో సాంగ్.. రామ్ సీత రామ్!

అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది రావడంతో మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ ప్రమాదం వల్ల ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకోవడంలో మరో వారం లేటు అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ ఎమ్‌ రత్నం నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ ని ఒక పిరియాడికల్ క్యారెక్టర్ లో చూసేందుకు అభిమానులతో, టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.