Movie Theater : కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన థియేటర్

ఇవాళ తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం వ్యాపించాయి. దీంతో సినిమా హాల్‌లోని ఫర్నీచర్‌........

Movie Theater :  కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన థియేటర్

Movie Theater

Movie Theater :   హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి థియేటర్ మొత్తం వ్యాపించాయి. దీంతో సినిమా హాల్‌లోని ఫర్నీచర్‌, సినిమా స్క్రీన్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Raviteja : సంక్రాంతికి రవితేజ ‘రావణాసుర’ ముహూర్తం

ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వటంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్ లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో థియేటర్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమేమి జరగలేదు కానీ భారీగా ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. ఈ థియేటర్ హైదరాబాద్ లోని చాలా పాత థియేటర్లలో ఒకటి.