Vikram : విక్రమ్ సినిమా.. థియేటర్లో చెలరేగిన మంటలు.. తగలబడిన తెర..

తాజాగా ఈ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్లో మంటలు చెలరేగి తెర కాలిపోయింది. ఈ సంఘటన పుదుచ్చేరిలోని కాలాపేట్‌లో ఉన్న జయా సినిమా హాల్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఫస్ట్ షో................

Vikram : విక్రమ్ సినిమా.. థియేటర్లో చెలరేగిన మంటలు.. తగలబడిన తెర..

Vikram Fire

Vikram :  స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య గెస్ట్ రోల్‌లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసిన సంగతి తెలిసిందే. రోజు రోజుకి స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్తుంది ఈ సినిమా.

తాజాగా ఈ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్లో మంటలు చెలరేగి తెర కాలిపోయింది. ఈ సంఘటన పుదుచ్చేరిలోని కాలాపేట్‌లో ఉన్న జయా సినిమా హాల్‌లో జరిగింది. మంగళవారం రాత్రి ఫస్ట్ షో జరుగుతున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య కనిపించే సమయానికి మంటలు చెలరేగాయి. స్క్రీన్ ఒక వైపు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటలను చూసి ప్రేక్షకులు భయపడి పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం తెర మాత్రమే కాలిపోయింది తెలిపారు.

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ వెడ్డింగ్​ ఇన్విటేషన్​ వీడియో ఇదేనా??

అయితే ఈ సంఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా కొంతమంది షార్ట్ సర్క్యూట్ అంటే మరి కొంతమంది సూర్య అభిమానులు సూర్య ఎంట్రీ సమయంలో కర్పూరం వెలిగించారని, బాణాసంచా కాల్చారని దానివల్లే మంటలు చెలరేగాయని కొంతమంది చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.