లీసా : త్రీడీలో భయపెడుతుంది

అంజలి మెయిన్ లీడ్‌గా నటించగా, రాజు విశ్వనాథ్ డైరెక్షన్‌లో తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ 'లిసా' మే 24 న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : May 13, 2019 / 06:09 AM IST
లీసా : త్రీడీలో భయపెడుతుంది

అంజలి మెయిన్ లీడ్‌గా నటించగా, రాజు విశ్వనాథ్ డైరెక్షన్‌లో తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘లిసా’ మే 24 న విడుదల కానుంది..

అంజలి మెయిన్ లీడ్‌గా నటించగా, రాజు విశ్వనాథ్ డైరెక్షన్‌లో తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ, లిసా.. ఈ సినిమాని నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇండియాలోనే మొట్టమొదటి రియల్ డి, తెలుగులో విడుదల కానున్న ఫస్ట్ హారర్ త్రీడీ ఫిలిం కూడా లీసానే కావడం విశేషం. మొదట 8కె ఫార్మాట్‌లో షూట్ చేసి, తర్వాత 2కెలోకి కన్వర్ట్ చేసారు. అంజలి నటన హైలెట్‌గా నిలుస్తుందని మూవీ మేకర్స్ చెప్తున్నారు. ఒక ఇంట్లో జరిగే ఊహించని సంఘటనలు, థ్రిల్లింగ్ అంశాలు హైలెట్‌గా తెరకెక్కిన లిసా పోస్టర్స్ అండ్ టీజర్‌కి మంచి స్పందన వస్తుంది.

మకరంద్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, యోగిబాబు, మైమ్ గోపి, శ్యామ్ జోన్స్  తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం లీసా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మే 24 న తెలుగుతో పాటు తమిళ్‌లోనూ విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం : సంతోష్ దయానిధి, ఎడిటింగ్ : ఎస్.ఎన్. ఫాజిల్, ఆర్ట్ : కెవి రమణ, స్టంట్స్ : స్టన్నర్ శ్యామ్, కొరియోగ్రాఫర్ : సురేష్, కెమెరా: పిజి ముత్తయ్య 

వాచ్ లిసా టీజర్..