BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ మొదటి వారం కెప్టెన్ ఎవరో తెలుసా??

బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ మొదటి వారం కెప్టెన్ ఎన్నిక ముగిసింది. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలవడంతో బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లో మొదటి కెప్టెన్‌గా......

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ మొదటి వారం కెప్టెన్ ఎవరో తెలుసా??

Tejaswi

BiggBoss Non Stop :  ఈ సారి బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ గా మొదలయిన రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. 24/7 అంటూ ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. దాంతో పాటు శని, ఆది వారాలు స్పెషల్ ఎపిసోడ్స్ తో అలరిస్తుంది బిగ్‌బాస్‌. ఈ సారి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ లో పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ కలిపి పార్టిసిపేట్ చేయడంతో షో రెండు గ్రూప్ ల మధ్య సాగుతున్నట్టు ఉంది. ఈ బిగ్‌బాస్‌ లో మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలవబడుతున్నారు.

అయితే ఈ నాన్ స్టాప్ బిగ్‌బాస్‌ లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల వల్ల అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నిన్నటితో బిగ్‌బాస్‌ ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎదురైన అవాంతరాలకు తెర పడింది. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌస్‌లో గొడవలు, ఏడుపులు, ఎమోషన్స్, నామినేషన్స్‌ తో ముందుకు వెళ్తుంది. మొదటి వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. మొదటి వారానికి కెప్టెన్సీ టాస్కులు కూడా పూర్తయ్యాయి,.

Varalakshmi Sarathkumar : హనుమాన్‌లో ‘అంజమ్మ’గా వరలక్ష్మి శరత్‌కుమార్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

 

Tejaswi (1)

దీంతో మొదటి వారం కెప్టెన్ ఎన్నిక ముగిసింది. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలవడంతో బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ లో మొదటి కెప్టెన్‌గా తేజస్వి అవతరించింది. తేజస్వి నటరాజ్‌ మాస్టర్‌ను రేషన్‌ మేనేజర్‌గా ఎంచుకుంది. అయితే ఎలాగైనా కెప్టెన్‌ అవ్వాలనుకున్న అషూరెడ్డి కనీసం కంటెండర్‌గా కూడా పోటీ చేయలేపోవడంతో బాధతో ఏడ్చేసింది. మరి తేజస్వి కెప్టెన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ను, హౌస్‌మేట్స్‌ను ఎలా లీడ్ చేస్తుందో చూడాలి.