చిట్టి నడుమునే చూస్తున్నా.. ‘భీష్మ’ : ఫస్ట్‌లుక్

దీపావళి సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

  • Published By: sekhar ,Published On : October 27, 2019 / 04:32 AM IST
చిట్టి నడుమునే చూస్తున్నా.. ‘భీష్మ’ : ఫస్ట్‌లుక్

దీపావళి సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

నితిన్, రష్మిక జంటగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్.. భీష్మ (సింగిల్ ఫరెవర్).. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దీపావళి సందర్భంగా.. ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘భీష్మ’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

యాక్షన్, రొమాంటిక్.. రెండు లుక్స్ విడుదల చేశారు. నితిన్ మేకోవర్, హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ‘లై’, ‘చల్ మోహన రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్.. ‘భీష్మ’తో ట్రాక్‌లోకి వస్తాననే ధీమాతో ఉన్నాడు.

Read Also : ‘వర్మ మార్క్’ కమ్మరాజ్యంలో కడపరెడ్లు : ట్రైలర్

నరేష్, సంపత్, రఘబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీను, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : మహతి స్వరసాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : సాహి సురేష్.