ప్రధానిపై సినిమా – ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్

ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 'మాన్ బైరాగి' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు..

  • Published By: sekhar ,Published On : September 17, 2019 / 10:12 AM IST
ప్రధానిపై సినిమా – ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్

ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘మాన్ బైరాగి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు..

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయాపిక్‌ల హవా నడుస్తోంది. ఒకటీ అరా తప్పా ఇప్పటి వరకూ వచ్చిన బయాపిక్‌లన్నీ విజయం సాధించాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధానిపై మరో బయోపిక్ రాబోతుంది.

సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్ కలిసి నిర్మిస్తుండగా, సంజయ్ త్రిపాఠి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘మన్ బైరాగి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ మూవీ ఫస్ట్ లుక్ (ఇంగ్లీష్ పోస్టర్) రిలీజ్ చేశాడు. అక్షయ్ కుమార్ తన ట్విట్టర్‌లో హిందీ పోస్టర్‌ను విడుదల చేశాడు.

మోదీ యువకుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన మలుపు ఏంటనేది ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మోదీ జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను చూపించనున్నామని దర్శక, నిర్మాతలు తెలిపారు. తెలుగులో ఈ సినిమాకు
‘మనోవిరాగి’ అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.