నాగకన్యలు వస్తున్నారు

నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన నీయా 2, తెలుగులో నాగకన్య పేరుతో రానుంది.

  • Published By: sekhar ,Published On : February 9, 2019 / 07:17 AM IST
నాగకన్యలు వస్తున్నారు

నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన నీయా 2, తెలుగులో నాగకన్య పేరుతో రానుంది.

జై, రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్స్‌గా, ఎల్.సురేష్ డైరెక్షన్‌లో, జంబో సినిమాస్ బ్యానర్‌పై.. శ్రీధర్ అరుణాచలం ప్రొడ్యూస్ చేస్తున్న తమిళ్ మూవీ… నీయా 2.. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేసారు. రాయ్, కేథరిన్ అండ్ వరలక్ష్మీ ముగ్గురూ, స్నేక్‌గా మారడం, జైతో రొమాన్స్ చెయ్యడం, అతణ్ణి పెళ్ళి చేసుకోవడం.. సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నాగదోషం, పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన నీయా 2, తెలుగులో నాగకన్య పేరుతో రానుంది.

రాయ్ లక్ష్మీ, వరలక్ష్మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసారు. రాయ్ గంభీరంగా చూస్తుంటే, వరలక్ష్మీ చేతులెత్తి బుసలు కొడుతున్నట్టు పోజిచ్చింది. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం వేర్ ఈజ్ ది వెంటలక్ష్మీ సినిమా చేస్తుంది. ఈ సినిమా టీజర్, సాంగ్‌కి రెస్పాన్స్ బాగుంది.  మార్చిలో నాగకన్య తెలుగు, తమిళ్‌లో రిలీజ్ కానుంది.

వాచ్ నీయా 2 తమిళ్ ట్రైలర్…