మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్ట తాప్సీ..

మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. మిథాలీగా తాప్సీ పన్ను..

  • Published By: sekhar ,Published On : January 29, 2020 / 10:16 AM IST
మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్ట తాప్సీ..

మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథు’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. మిథాలీగా తాప్సీ పన్ను..

ప్ర‌స్తుతం భారతదేశ చిత్రపరిశ్రమలో బ‌యోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ స్టార్స్, పొలిటిషియన్స్, స్పోర్ట్ పర్సన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే ధోని, సచిన్, అజారుద్దీన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందాయి.

వారి దారిలోనే మ‌హిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అంద‌రి దృష్టిని ఆకర్షించారు ఉమెన్‌ క్రికెట‌ర్ మిథాలీ రాజ్. భార‌త్ క్రికెట్‌కి ఎన‌లేని సేవ‌లందించిన ఆమె జీవిత నేప‌థ్యంలో తాజాగా ఓ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌యాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ న‌టిస్తోంది.

Read Also : మరో హాలీవుడ్ మూవీలో పీసీ

Image

షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని దర్శకుడు. ‘శ‌భాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా  ఫ‌స్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో తాప్సీ మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. 2021 ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేయనున్నారు.