’96’ రీమేక్: శర్వానంద్ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా!

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 05:38 AM IST
’96’ రీమేక్: శర్వానంద్ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా!

శర్వానంద్, సమంత జంటగా.. తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో చేస్తున్నారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. అయితే తాజాగా మూవీ యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అండ్ టైటిల్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమా ‘జాను’ అనే టైటిల్ తో రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. నాలుగు ఒంటెలకు ఎదురుగా.. ఎడారిలో శర్వానంద్ కెమెరా పట్టుకొని కనిపిస్తున్నాడు. పోస్టర్ చూడటానికి చాలా డిఫరెంట్ గా, ఇంట్రస్టింగ్ గా ఉంది.

మరి ఫస్ట్ లుక్ లో శర్వానంద్ కనిపించి, కనిపించనట్లుగా కనిపించేశాడు. కానీ, సమంత లుక్ మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు చిత్రయూనిట్. ఆమె లుక్ కొసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ఆడియెన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సమంత కూడా ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మొన్నామధ్య ట్విట్టర్ లో పేర్కొంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదలని కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.