Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి రవితేజ ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు.

Dhamaka: మొదట పాయల్.. తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా!

Dhamaka

Dhamaka: క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి రవితేజ ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. వరసగా సినిమాలను పూర్తిచేస్తూ యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ప్రస్తుతం మొత్తం ఐదు సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేసిన ‘ఖిలాడీ’ సినిమా విడుదలకి సిద్ధమవగా.. ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు మొదలు పెట్టాడు. అవి రెండు పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలకు కొబ్బరికాయ కొట్టాడు.

SSMB 28: త్రివిక్రమ్ కొత్త కాంబినేషన్.. మహేష్‌తో అందాల రాక్షసి!

రవితేజ సినిమాలలో రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ సినిమాలు విడుదలకి సిద్దమవగా ధమాఖా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు సెట్స్ మీదున్నాయి. వీటిలో నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రానున్న ధమాకా సినిమా రవితేజ మార్క్ ఎనర్జటిక్ తో పక్కా టైం పాస్ సినిమాగా తెరకెక్కుతుంది. ఇందులో ఐటెం నెంబర్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన మేకర్స్ ఇందుకోసం ముందుగా పాయల్ రాజ్ పుత్ ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత పాయల్ కాదు అనసూయ ఈ పాటకు చిందులేయనుందని వినిపించింది.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

కానీ ఇప్పుడు పాయల్, అనసూయ కాదు ఈ పాటలో అచ్చ తెలుగు అమ్మడు ఈషా రెబ్బా ఈ పాటలో నటించనుందని తాజా అప్ డేట్. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు కానీ దాదాపుగా ఇదే కన్ఫర్మ్ అంటున్నారు. ఈషా ఇప్పటి వరకు ఐటెం నెంబర్ లో కనిపించకపోగా ఫ్రెష్ లుక్ కోసమే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. నక్కిన త్రినాధరావు అంటే చిన్న సినిమాలలో కమర్షియల్ దర్శకుడిగా పేరు. ఇక, ఈ సినిమాలో కూడా ఫుల్ లెన్త్ కామెడీ పాత్రలతో ఓ రేంజ్ ఫన్ పంచబోతున్నట్లు తెలుస్తుంది.