BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

ఈ సారి నామినేషన్స్ లో చాలెంజర్స్ అంతా వారియర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయాలి అని బిగ్‌బాస్‌ చెప్పటంతో చాలెంజర్స్ అంతా ఒక్కొక్కరు ఇద్దర్ని నామినేట్ చేశారు. అలా ఎక్కువగా నామినేట్.....

BiggBoss Non Stop : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

BiggBoss Non Stop :  డిస్నిప్లస్ హాట్‌స్టార్‌లో ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం నుండే రసవత్తరంగా సాగుతుంది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు వారియర్స్‌గా, కొత్త కంటెస్టెంట్లు చాలెంజర్స్‌గా పిలుస్తున్నారు. దీంతో ఈ సారి గేమ్ వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టు సాగుతుంది. మొదటి వారంలోనే గొడవలు, ఏడుపులు, పగలు మొదలయ్యాయి. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటివారం నామినేషన్ల పర్వం జరిగింది.

ఈ సారి నామినేషన్స్ లో చాలెంజర్స్ అంతా వారియర్స్ లో ఇద్దరిని నామినేట్ చేయాలి అని బిగ్‌బాస్‌ చెప్పటంతో చాలెంజర్స్ అంతా ఒక్కొక్కరు ఇద్దర్ని నామినేట్ చేశారు. అలా ఎక్కువగా నామినేట్ అయిన వాళ్లలో వారియర్స్ నుంచి అయిదుగురిని ఈ వారం నామినేషన్స్ లో ఉంచారు. ఈ సారి వారియర్స్ టీం నుంచి నటరాజ్‌ మాస్టర్‌, సరయు, హమీదా, అరియానా, ముమైత్‌ ఖాన్‌ నామినేషన్స్ లో ఉన్నారు. ఎక్కువగా నటరాజ్ మాస్టర్ ని, సరయుని నామినేట్ చేయడంతో సరయు ఫైర్ అవ్వగా, నటరాజ్ మాస్టర్ ఏడ్చేశారు.

BiggBoss Non Stop : ముమైత్ నా చెయ్యి విరగ్గొట్టింది.. బిగ్‌బాస్ లో పాతవి గుర్తుచేసుకొని ఏడ్చేసిన శ్రీరాపాక

ఇక ఆ తర్వాత చాలెంజర్స్ లో ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉండగా వారియర్స్‌ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో మిత్ర శర్మ, ఆర్జే చైతూను నామినేట్‌ చేశారు. దీంతో ఈ సారి నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. మరి ఈ ఏడుగురిలో మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వనున్నారో తెలియాలి అంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.