Raavanasura : అయిదుగురు హీరోయిన్స్‌తో రవితేజ

ఇటీవలే జనవరి 14న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రవితేజ కొత్త సినిమా ‘రావణాసుర’ ముహూర్తం షూటింగ్ జరిగింది. ‘రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనబడబోతున్నాడు. రవితేజ కెరీర్..

Raavanasura : అయిదుగురు హీరోయిన్స్‌తో రవితేజ

Raviteja (1)

Raviteja :  మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమాతో గత సంవత్సరం భారీ విజయం సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో వరుస సినిమాలని అనౌన్స్ చేశాడు. ఇప్పటికే రవితేజ సినిమా ‘ఖిలాడీ’ రిలీజ్ కి రెడీగా ఉంది. మరో సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ లో ఉంది. తాజాగా మరో సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టేస్తున్నాడు. ఇటీవలే జనవరి 14న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రవితేజ కొత్త సినిమా ‘రావణాసుర’ ముహూర్తం షూటింగ్ జరిగింది.

‘రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనబడబోతున్నాడు. రవితేజ కెరీర్ లో తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అయిదుగురు హీరోయిన్స్ నటించనున్నారు.

Evam Jagath : రూపాయికే సినిమా.. మంచి సినిమా కోసం కొత్త దర్శకుడి తాపత్రాయం..

అనూ ఇమాన్యుల్, పూజిత పొన్నాడ, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, దక్ష నగర్కార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ఓపెనింగ్ రోజు ఈ అయిదుగురు భామలు కూడా సందడి చేశారు. ముహూర్తం షూట్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు.