Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’

Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

Ravanasura

Ravanasura: మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’, కొత్త డైరెక్టర్ శరత్ మండవ డైరెక్షన్లో ‘రామారావు – ఆన్ డ్యూటీ’, త్రినాధరావు నక్కినతో ‘ధమాకా’ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సుధీర్ వర్మతో మరో సినిమా అనౌన్స్ చేయగా రవితేజ హీరోగా నటిస్తున్న 70వ సినిమా ఇది.

Raviteja : మెగాస్టార్ చేతుల మీదుగా ‘రావణాసుర’ ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టగా ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ముహూర్తం షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా, ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Raviteja : నా వెనక ఉండి రాజకీయాలు చేశారు : రవితేజ

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ కు స్కోప్ ఉండగా ఇప్పటికే ఐదుగురిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నడ, దక్ష నగర్కర్ ఈ సినిమాలో నటిస్తుండగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో సుశాంత్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ లు సంగీతం అందిస్తుండగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.