Telugu Films: ఒకేసారి ఐదు సినిమాలు.. ఈ నలుగురికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. కొందరు హీరోలయితే మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి..

Telugu Films: ఒకేసారి ఐదు సినిమాలు.. ఈ నలుగురికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Telugu Films

Telugu Films: సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. కొందరు హీరోలయితే మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి రఫ్ఫాడించేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ ఇంకొంతమంది.. సెట్స్ పై ఉన్నవి ఉండగానే.. కొత్తవాటి కోసం గట్టి ముహూర్తం పెట్టేసుకున్నారు. ఈ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరోల సంగతేంటో ఇప్పుడు చూసేద్దాం.

Jr NTR: ఫిబ్రవరిలో ఒకటి.. అక్టోబర్‌లో మరొకటి!

తన కెరీర్ లో నెవర్ బిఫోర్ ఫీట్ సాధించారు ప్రభాస్. అతితక్కువ రోజుల్లో ఆదిపురుష్ పూర్తి చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసారు. మూడేళ్లు టైం తీసుకున్న రాధేశ్యామ్ తో కంపేర్ చేస్తే రెబల్ స్టార్ దీన్ని జెట్ స్పీడ్ లో పూర్తి చేసినట్టే. ఈ లెవెల్ లో స్పీడ్ పెంచారు కాబట్టే.. ఒకేసారి 5 సినిమాలను లైన్ లో పెట్టగలిగారు. గ్లోబల్ స్టార్ అన్నపేరుకు ఏమాత్రం తగ్గకుండా ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం.. అవన్నీ కూడా భారీ సినిమాలు కావడం కేవలం రెబల్ స్టార్ కి మాత్రమే చెల్లింది.

Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

రాధేశ్యామ్ సంక్రాంతికి వచ్చేస్తోంది. ఆదిపురుష్ లో ప్రభాస్ పార్ట్ కంప్లీటయింది. ప్రస్తుతం సెట్స్ పైఉన్న సలార్ మూవీకి కూడా త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతున్నారు. అతిత్వరలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం రంగంలోకి దిగబోతున్నారు ప్రభాస్. ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కోసం దాదాపు 200 రోజులు డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఈ సినిమాలో తన పార్ట్ ను పూర్తి చేస్తే సందీప్ రెడ్డి వంగాతో కమిటైన స్పిరిట్ ను కూడా కిక్ స్టార్ట్ చేస్తారు గ్లోబల్ స్టార్.

Raai Laxmi: హాట్ బ్యూటీ ‘రత్తాలు’ అందాల వల!

ప్రభాస్ తర్వాత నంబర్ గేమ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు చిరంజీవి. సీనియర్ స్టార్ అయినా సరే యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. తెలివిగా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ చకచకా సినిమాల పని పడుతున్నారు. చిరూ చేతిలో కూడా ప్రెజెంట్ 5 సినిమాలున్నాయి. ఆచార్య 2022 ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది. మెహర్ రమేశ్ భోళాశంకర్, మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్ జరుగుతోంది. వెరీ రీసెంట్ గా సెట్స్ పైకెళ్లిన బాబీ మూవీ వాల్తేర్ వీరయ్య కూడా త్వరలోనే రెగ్యులర్ షెడ్యూల్ తో బిజీకానుంది. ఆ తర్వాత వెంకీ కుడుముల సినిమాను లైన్లో పెట్టారు. డివివి దానయ్య నిర్మాణంలో మెగాస్టార్ – వెంకీ కుడుమల కాంబోపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది.

NTR 30: కొరటాల సినిమా కథ ఇదే.. రివీల్ చేసిన తారక్!

మాంచి దూకుడు మీదున్నారు మాస్ రాజా రవితేజ. క్రాక్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవాటిని ఫటాఫట్ పూర్తి చేస్తున్నారు. ఖిలాడి, ధమాకా, రామా రావ్ ఆన్ డ్యూటీ షూటింగ్స్ ఓవైపు జరుగుతుండగానే…మరోవైపు తన కెరీర్ లో 70వ సినిమా సుధీర్ వర్మ కాంబినేషన్ లో ప్రకటించారు. 71వ సినిమాను దొంగాట వంశీ కాంబోలో టైగర్ నాగేశ్వరరావు పేరుతో అనౌన్స్ చేసారు. అంతేకాదు చిరూ హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో రవితేజ కూడా నటించే ఛాన్స్ ఉంది.

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. శంకర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ లో దడదడలాడిస్తున్నాడు. జనవరి 7న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్, ఫిబ్రవరి 4న వచ్చేస్తోన్న ఆచార్య సినిమాలకు ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేయబోతున్నారు మెగాపవర్ స్టార్. అటు శంకర్ ప్రాజెక్ట్ తర్వాత జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితో ఫిక్స్ చేసుకున్నారు. ఆపై ప్రశాంత్ నీల్, డివివి దానయ్య కాంబోలో మరో ఫ్లిక్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. అంటే బ్యాక్ టు బ్యాక్ చరణ్ కూడా ఐదు సినిమాలను ఆర్డర్ లో పెట్టినట్టే.