Flora Saini : నిర్మాత పై బాలయ్య భామ ఆరోపణలు.. చిత్రహింసలు పెట్టాడు అంటూ ఫోటో రిలీజ్!

తెలుగు వారికీ లక్స్ పాపగా గుర్తుండిపోయిన నటి 'ఆశా సైనీ'. ప్రేమకోసం సినిమాతో వెండితెరకు పరిచమైన ఆశా బాలకృష్ణ 'నరసింహ నాయుడు' సినిమాలో 'లక్స్ పాప' సాంగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ పెళ్ళికి సిద్దమవుతుంది. ఈ శుభవార్తని తెలియజేస్తూ.. తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.

Flora Saini : నిర్మాత పై బాలయ్య భామ ఆరోపణలు.. చిత్రహింసలు పెట్టాడు అంటూ ఫోటో రిలీజ్!

flora saini

Flora Saini : తెలుగు వారికీ లక్స్ పాపగా గుర్తుండిపోయిన నటి ‘ఆశా సైనీ’. ప్రేమకోసం సినిమాతో వెండితెరకు పరిచమైన ఆశా బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ సినిమాలో ‘లక్స్ పాప’ సాంగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, రాజశేఖర్ తో మనసున్న మారాజు వంటి ఎన్నో సూపర్ హిట్టు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ, రజినీకాంత్, శివరాజ్ కుమార్ ఇలా సౌత్ లోని స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆశా.. 2014 నుంచి బాలీవుడ్ కి చెక్కేసి మళ్ళీ సౌత్ వైపు చూడ లేదు. అయితే అందుకు రీజన్ ఇప్పుడు బయటపెట్టింది ఆశా.

Pooja Hegde: బుట్టబొమ్మతో నాగార్జున సరికొత్త యాడ్.. సమ్మర్ కోసం స్పెషల్ యాడ్ రెడీ..

ప్రస్తుతం ఈ భామ పెళ్ళికి సిద్దమవుతుంది. ఈ శుభవార్తని తెలియజేస్తూ.. తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. “నా 20 ఏళ్ళ వయసులో నేను కెరీర్ పరంగా చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాను. డిజైనర్స్ కి మోడల్‌గా, నటిగా పది పైగా సినిమాలు చేసేశాను. కానీ అదే సమయంలో నేను ఒక స్టార్ ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడ్డాను. మెల్లిమెల్లిగా పరిస్థితులు అన్ని మారిపోతూ వచ్చాయి. నన్ను వేధింపులకు గురి చేశాడు. సినిమాల్లో నటించవద్దు అంటూ 14 నెలలు పాటు ఎవరితో మాట్లాడనివ్వలేదు.

నా మొఖం మీద, ప్రైవేట్ భాగాలు మీద బాక్సింగ్ చేసేవాడు. ఒక సమయంలో నా పొట్ట మీద గట్టిగా కొట్టాడు. అప్పుడు ఆ నొప్పి భరించలేక పోయాను. వెంటనే అక్కడి నుంచి పారిపోయి మా అమ్మనాన్నల దగ్గరకి వచ్చేశాను. ఆ నిర్మాత వల్ల నేను అనుభవించిన మానసిక, శారీరక భాధ నుంచి బయట పడడానికి నాకు నెలల సమయం పట్టింది. తరువాత పరిస్థితులు అన్ని చక్కబడి నేను మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యాను. ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నా జీవితంలో నేను మళ్ళీ ఇప్పుడు ప్రేమని పొందాను” అంటూ తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Flora Saini (@florasaini)