Flora Saini : శ్రద్ధా వాకర్ పరిస్థితే నాకు కూడా వచ్చేదేమో.. బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

ఫ్లోరా సైని మాట్లాడుతూ.. '' గౌరంగ్‌ మొదట్లో బాగానే ఉండేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. ఇంట్లో వాళ్ళు వద్దన్నా అతని దగ్గరికి వెళ్ళిపోయాను. మొదట నన్ను నా కుటుంబానికి దూరం చేశాడు. అతని ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే అతని అసలు రూపం.................

Flora Saini : శ్రద్ధా వాకర్ పరిస్థితే నాకు కూడా వచ్చేదేమో.. బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

Flora Saini :  ఇటీవల ఢిల్లీలో శ్రద్హ వాకర్ అనే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయే ముక్కలు ముక్కలు నరికి చంపేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఓ బాలీవుడ్ భామ తనకి కూడా శ్రద్దా వాకర్ లాంటి పరిస్థితి వచ్చేదేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో నరసింహ నాయిడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, సొంతం లాంటి పలు సినిమాల్లో నటించిన ఫ్లోరా సైని అనంతరం బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఫ్లోరా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది.

గతంలో ఫ్లోరా సైని బాలీవుడ్ నిర్మాత గౌరంగ్‌ దోషితో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసింది. అనంతరం విడిపోయింది. 2018లోనే మీటూ ఉద్యమం జరిగినప్పుడు గౌరంగ్‌ దోషిపై తీవ్ర ఆరోపణలు చేసింది ఫ్లోరా. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి గౌరంగ్‌ దోషితో ఉన్న చేదు అనుభవాలని తెలిపింది.

Priyanka Chopra : నన్ను నల్లపిల్లి అని వెక్కిరించేవాళ్ళు..

ఫ్లోరా సైని మాట్లాడుతూ.. ” గౌరంగ్‌ మొదట్లో బాగానే ఉండేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. ఇంట్లో వాళ్ళు వద్దన్నా అతని దగ్గరికి వెళ్ళిపోయాను. మొదట నన్ను నా కుటుంబానికి దూరం చేశాడు. అతని ఇంటికి వెళ్లిన వారం రోజుల్లోనే అతని అసలు రూపం బయటపెట్టాడు. రోజూ కొట్టేవాడు. మొదట్లో నేనే ఏమన్నా తప్పు చేశానేమో అనుకోని సర్దుకుపోయేదాన్ని. కానీ తర్వాత నన్ను హింసించడం మొదలుపెట్టాడు. నన్ను మానసికంగా, శారీరికంగా చాలా బాధపెట్టాడు. నేను వెళ్ళిపోతాను అంటే చంపేస్తానని బెదిరించాడు. మా పేరెంట్స్ ని కూడా బెదిరించాడు. ఒకరోజు బాగా కొట్టి ఇవాళ చంపేస్తాను అని అన్నాడు. ఆ సమయానికి అనుకోకుండా మా అమ్మ వచ్చింది. అంతే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని పట్టుకొని ఏడ్చేశాను. అప్పుడు మా అమ్మతో బయటకి వచ్చేశాను. పోలీసులకి మొదట కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులు సీరియస్ గా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాక తీసుకున్నారు. ఒకవేళ ఆ రోజు నేను మా అమ్మతో పాటు వచ్చేసి ఉండకపోతే నా పరిస్థితి కూడా శ్రద్ధా వాకర్ లాగే అయ్యేదేమో” అంటూ ఎమోషనల్ అయింది.